Liger: ఓ రేంజ్ ప్రమోషన్లు.. రౌడీ హీరో బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్!

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు లైగర్. మొన్న టి వరకూ చుప్ చాప్ గా ఉన్న లైగర్ ఇప్పుడు వరస పెట్టి అప్ డేట్స్ తో యాక్టివ్ అయిపోతున్నాడు. రిలీజ్ కి ఇంకా 9 నెలల టైమ్ ఉన్నా ..

Liger: లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు లైగర్. మొన్న టి వరకూ చుప్ చాప్ గా ఉన్న లైగర్ ఇప్పుడు వరస పెట్టి అప్ డేట్స్ తో యాక్టివ్ అయిపోతున్నాడు. రిలీజ్ కి ఇంకా 9 నెలల టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నాడు. ఇయర్ఎండ్ కి బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ తో ఫాన్స్ కి న్యూయర్ కి గట్టిగానే గిఫ్ట్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ.

Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఎంత లేటవుతున్నా.. సినిమా మీద ఆడియన్స్ లో క్రేజ్, ఎక్స్ పెక్టేషన్స్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు లైగర్ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్ డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తెలుగు ఎంట్రీ ఇస్తున్న ఈ సూపర్ క్రేజీ సినిమా మీద ఆడియన్స్ లో ఉన్న హైప్స్ ని బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ అంటూ ఇంకాస్త పీక్స్ కి తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ.

Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

లైగర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ వీడియో రిలీజ్ కాకుండానే.. జస్ట్ మాటలతోనే సినిమా మీద హైప్స్ పెంచేస్తున్నారు విజయ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు షూటింగ్ లో ఉన్న ఇంటెన్స్ ఫోటోస్ రిలీజ్ చేసింది లైగర్ టీమ్. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ఆడియన్స్ లో హిస్టీరియా క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ 2022లో ఇండియా మొత్తం లైగర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు విజయ్ దేవరకొండ.

Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా బాలీవుడ్ ప్రొడ్యూసర్లే కాకుండా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ యాడ్ అవ్వడంతో సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో ఇప్పటి నుంచే ప్రమోషన్లు చేస్తున్నారు. డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజులూ బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ తో ఫాన్స్ లో లైగర్ ఫీవర్ ని పెంచబోతున్నారు విజయ్.

ట్రెండింగ్ వార్తలు