KS Bhagwan: రాముడు ఆదర్శవంతుడు కాదు, 11 వేల ఏళ్లు పాలించనూ లేదు.. కన్నడ రచయిత హాట్ కామెంట్స్

హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నవలల్లోని పాత్రలు మాత్రమే. వారు చారిత్రక పురుషులు కాదు. అశోక చక్రవర్తి మాత్రం నిజమైన చారిత్రక పురుషుడు. ఉత్తరాఖండ్‭లో శివలింగంపై బుద్ధుడి చిత్రాలు ఉంటాయి. దీనిపై బౌద్ధులు కోర్టును ఆశ్రయించి, పిటిషన్ సైతం వేశారు. దేవాలయాలను మసీదులుగా మార్చారని కొందరు వాదిస్తున్నారు.

KS Bhagwan: తెలుగు వ్యాకరణం చదవాల్సి వస్తే.. వ్యాకరణం ప్రారంభంలోనే ‘రాముడు మంచి బాలుడు’ అనే వాక్యం కనిపిస్తుంది. ఏదో ఒక సందర్భంలో రాముడి గొప్పతనాన్ని వర్ణిస్తూ అనేక సూచనలు ఉంటాయి. అయితే రాముడిపై విమర్శలు లేకపోలేదు. నాస్తిక వాదులో లేదంటే ఇతరులో అప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. తాజాగా కర్ణాటకకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్, రచయిత అయిన కేఎస్ భగ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు ఆదర్శవంతుడు కాదని, అలాగే రాముడు ఈ దేశాన్ని 11,000 ఏళ్లు పాలించాడని చెప్పేది అవాస్తవమని ఆయన అన్నారు.

Vasantha Mulasavalagi: ముస్లింలకు నిజంగా ధ్వేషమే ఉంటే ఒక్క హిందువు మిగిలేవారు కాదట!.. వివాదాస్పదమవుతున్న రిటైర్డ్ జడ్జి వ్యాఖ్యలు

‘‘రామరాజ్య నిర్మాణం గురించి చర్చ జరుగుతోంది. నిజానికి వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ చదివితే (భగవంతుడు) రాముడు ఆదర్శంగా లేడని స్పష్టమవుతుంది. అతను 11,000 సంవత్సరాలు పాలించలేదు కూడా. కేవలం 11 సంవత్సరాలు మాత్రమే పాలించినట్లు అందులో రాసి ఉంది. రాముడు మధ్యాహ్నం సీతతో కూర్చొని మిగిలిన రోజంతా తాగుతాడు. అతను తన భార్య సీతను అడవికి పంపాడు. ఆమె గురించి ఏమాత్రం బాధపడలేదు. ఇంతే కాదు, తపస్సు చేస్తున్నాడని శూద్రుడైన శంబుకుని తల నరికాడు. ఇలాంటి వ్యక్తి ఎలా ఆదర్శవందుడు అవుతాడు?’’ కేఎస్ భగ్వాన్ అన్నారు.

Narayan Patel: రోడ్లు బాగుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయట.. బీజేపీ ఎమ్మెల్యే విచిత్ర వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం ఇదే కర్ణాటకకు చెందిన రిటైర్డ్ జడ్జి ములసావలగి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నవలల్లోని పాత్రలు మాత్రమే. వారు చారిత్రక పురుషులు కాదు. అశోక చక్రవర్తి మాత్రం నిజమైన చారిత్రక పురుషుడు. ఉత్తరాఖండ్‭లో శివలింగంపై బుద్ధుడి చిత్రాలు ఉంటాయి. దీనిపై బౌద్ధులు కోర్టును ఆశ్రయించి, పిటిషన్ సైతం వేశారు. దేవాలయాలను మసీదులుగా మార్చారని కొందరు వాదిస్తున్నారు. అసలు దేవాలయాలు నిర్మించకముందే అశోక చక్రవర్తి 84 వేల బౌద్ధ విహారాలను నిర్మాంచరు. మరి అవెక్కడ ఉన్నాయో చెప్పగలరా? భారత చరిత్రలో అసలు వాస్తవం ఇది. బౌద్ధ విహారాల ఆచూకీని పెద్ద సమస్యగా మార్చగలరా?’’ అని ఆయన ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు