Vasantha Mulasavalagi: ముస్లింలకు నిజంగా ధ్వేషమే ఉంటే ఒక్క హిందువు మిగిలేవారు కాదట!.. వివాదాస్పదమవుతున్న రిటైర్డ్ జడ్జి వ్యాఖ్యలు

ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని ప్రజలు ఇప్పటికీ చూడొచ్చు. ఆమె ఇస్లాంలోకి మారలేదు. వారి పాలనలో ముస్లింలు కనుక హిందువులను వ్యతిరేకించి ఉంటే దేశంలో ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవారు కాదు

Vasantha Mulasavalagi: ముస్లింలకు హిందువులపై ధ్వేషం ఉందా? గుడిని కూల్చి మసీదు కట్టారు. మరి అంతకు ముందు బౌద్ధారామం ఏమైంది? ఈ రెండు అంశాలపై దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని మరోసారి లేవనెత్తి మరింత చర్చనీయాంశంగా మార్చారు విశ్రాంత న్యాయమూర్తి వసంత ములసావలగి. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ‘రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాయా?’ అన్న అంశంపై మాట్లాడుతూ కర్ణాటక రిటైర్డ్ జడ్జీ అయిన ములసావలగి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చను దాటి దుమారానికి కూడా దారి తీస్తున్నాయి.

‘‘హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నవలల్లోని పాత్రలు మాత్రమే. వారు చారిత్రక పురుషులు కాదు. అశోక చక్రవర్తి మాత్రం నిజమైన చారిత్రక పురుషుడు. ఉత్తరాఖండ్‭లో శివలింగంపై బుద్ధుడి చిత్రాలు ఉంటాయి. దీనిపై బౌద్ధులు కోర్టును ఆశ్రయించి, పిటిషన్ సైతం వేశారు. దేవాలయాలను మసీదులుగా మార్చారని కొందరు వాదిస్తున్నారు. అసలు దేవాలయాలు నిర్మించకముందే అశోక చక్రవర్తి 84 వేల బౌద్ధ విహారాలను నిర్మాంచరు. మరి అవెక్కడ ఉన్నాయో చెప్పగలరా? భారత చరిత్రలో అసలు వాస్తవం ఇది. బౌద్ధ విహారాల ఆచూకీని పెద్ద సమస్యగా మార్చగలరా?’’ అని ఆయన ప్రశ్నించారు.

Anti-Brahmin: జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ వీసీ

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని ప్రజలు ఇప్పటికీ చూడొచ్చు. ఆమె ఇస్లాంలోకి మారలేదు. వారి పాలనలో ముస్లింలు కనుక హిందువులను వ్యతిరేకించి ఉంటే దేశంలో ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవారు కాదు. హిందువులందరినీ ఎప్పుడో చంపేసి ఉండేవారు. అన్ని వందల ఏళ్లు ఈ దేశాన్ని పాలించినప్పటికీ ముస్లింలు మైనారిటీలుగానే ఉన్నారు. ఎందుకు అలా మిగిలిపోయారు?’’ అని అన్నారు.

India at UN: ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో మాకు పాఠాలు చెప్పొద్దు.. ఐక్యరాజ్య సమితిలో భారత్

ఇక రాజ్యాంగంపై ఆయన స్పందిస్తూ ‘‘రాజ్యంగ లక్ష్యాలు స్పష్టంగా, కచ్చితంగానే ఉన్నాయి. కానీ, ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో వ్యవస్థ విఫలమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ముగింపు పలికేందుకు యువతరం ఈ దిశగా అప్రమత్తంగా, చురుగ్గా మారాలి. యథాతథ స్థితిని కొనసాగించేందుకు, దేవాలయాలు, చర్చిలు, మసీదులను యథాతథంగా ఉంచేందుకు 1999లో ఓ చట్టం ఉంది. కానీ ఈ విషయంలో జిల్లా కోర్టు పరస్పర విరుద్ధమైన తీర్పు ఇచ్చింది’’ అని ములసావలగి అన్నారు.

అయితే జస్టిస్ ములసావలగి చేసిన ఈ వ్యాఖ్యలపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు అని వాదిస్తుండగా, మరి కొందరు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. మరి కొందరు ఆయన వ్యాఖ్యలకు బేషరతు మద్దతు ఇస్తున్నారు. ములసావలగి చెప్పింది అక్షరాల నిజమని, చరిత్ర వాస్తవాలు నవలల నుంచి కాకుండా మూలాల నుంచి చూడాలని, అప్పుడే వాస్తవాలు బయటికి తెలుస్తాయని, అదే ఆయన చెప్పారంటూ సమర్ధిస్తున్నారు.

Supreme Court: జడ్జీల నియామకంలో కొలీజియంను సమర్ధించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానం

ట్రెండింగ్ వార్తలు