PM Modi
భారత్‌లో శక్తిమంతమైన ప్రభుత్వం ఉండడంతో శత్రువులు మన దేశానికి ఏదైనా హాని చేయాలంటే ముందు 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల వేళ ఇవాళ హరియాణాలోని అంబాలాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు.
చేతిలో బాంబులతో 70 ఏళ్లుగా భారత్‌ను ఇబ్బందులకు గురిచేసిన పొరుగు దేశం (పాకిస్థాన్) ఇప్పుడు ఇండియాలోని బలమైన బీజేపీ సర్కారు కారణంగా చేతిలో చిప్పతో తిరుగుతోందని అన్నారు. తమ శక్తిమంతమైన ప్రభుత్వం ఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టిందని చెప్పారు.
ఇప్పుడు కశ్మీర్ అభివృద్ధి దిశగా నడుస్తోందని తెలిపారు. బలహీనమైన సర్కారు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను మార్చుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో హరియాణాలోని తల్లులు పగలు, రాత్రి ఆందోళన చెందలేదా అని అడిగారు.
అటువంటి వాటికి ముగింపు పలికి పదేళ్లు అవుతుందని చెప్పారు. ఇండియా కూటమి జూన్ 4న ఓడిపోతుందని హరియాణా ప్రజలకు తెలుసని అన్నారు. అందుకు మరో 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. హరియాణా ప్రజలకు దేశభక్తి రక్తంలోనే ఉందని తెలిపారు.
Also Read: ఏపీలోని ఈ మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం.. ఈసీ ఆదేశాలు జారీ