Chandrabose : ‘నాటునాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాకతో.. గేయ రచయిత చంద్రబోస్‌ను సన్మానించిన మెగాస్టార్..

ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ వేడుకల్లో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆ పాట రాసిన సినీ గేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి రచించారు...............

Chandrabose : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించి ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. హాలీవుడ్ లో అయితే ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ లభించింది. ఇప్పటికే పలు హాలీవుడ్ అవార్డులు RRR సినిమాకి వివిధ విభాగాల్లో వరించాయి.

తాజాగా ఇటీవల RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. అంతర్జాతీయ వేదికపై ఈ అవార్డుని సంగీత దర్శకుడు MM కీరవాణి అందుకున్నారు. ఈ పాటలో భాగమైన వాళ్లందరికీ స్టేజిమీదే ధన్యవాదాలు తెలిపారు కీరవాణి. దీంతో ప్రేక్షకులు, నెటిజన్లు, అభిమానులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు RRR యూనిట్ తో పాటు నాటు నాటు పాటలో భాగం అయిన వాళ్లందరికి అభినందనలు తెలిపారు.

Suhsmitha Konidela : నిర్మాతగా నాన్నతో సినిమా తీయాలని ఉంది.. నాన్నకి చెప్తే..

ఇక ఈ పాటని గేయ రచయిత చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల్ భైరవ కలిసి పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకి స్టెప్పులు సమకూర్చారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమాలోని పాటలని చంద్రబోస్ రాశారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ వేడుకల్లో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆ పాట రాసిన సినీ గేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి రచించారు. ఈ సన్మానంలో చిరంజీవి, రవితేజ తో పాటు వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. అనంతరం చిరంజీవి చంద్రబోస్ ని అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు