MLC Kavitha: సీఎం కేసీఆర్ వల్లే ఇవి సాధ్యమయ్యాయి: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాకే గ్రౌండ్ వాటర్ పెరిగిందని కవిత చెప్పారు.

MLC Kavitha – Farmers: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా (Kamareddy district) సదాశివనగర్ మండలం పద్మాజీ వాడలో ఇవాళ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవని, వారి సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కవిత చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేవని, విద్యుత్ సమస్యలు లేవని అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్టు పెడుతున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాకే గ్రౌండ్ వాటర్ పెరిగిందని చెప్పారు. చెరువుల పునరుద్ధరణతో నీటి మట్టం పెరిగిందని అన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కవిత చెప్పారు. రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై పదో ఏడాదిలోకి అడుగు పెట్టిందని గుర్తు చేశారు. రైతుకు మర్యాద తెచ్చిన సర్కారు కేసీఆర్ సర్కారేనని అన్నారు. రైతులు సంఘటితం కావాలని రైతు బంధు సమితులు ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించి ఇచ్చామని చెప్పారు.

V.Hanumantha Rao: కర్ణాటకలో హామీల అమలు.. ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే ఆ ప్రభావం..: వీహెచ్

ట్రెండింగ్ వార్తలు