Agnipath Recruitment 2022: భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?

భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Agnipath Recruitment 2022: భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 20,499 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. నావికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం జూలై 1 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2,800 ఉద్యోగాలకు శుక్రవారం నాటికి మొత్తం 3,03,328 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కొత్త పథకంలో రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్స్ అంటారు. నావికాదళం జూలై 1 నుంచి 12వ తరగతి (సీనియర్ సెకండరీ రిక్రూట్‌లు) ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్ మోడల్ కింద రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించింది జూలై 24 వరకు ప్రక్రియ కొనసాగుతుంది. నావికాదళం 10వ తరగతి ఉత్తీర్ణులైన 200 మంది అభ్యర్థులను కూడా రిక్రూట్ చేస్తోంది (మెట్రిక్యులేషన్ రిక్రూట్‌లు). ఇందుకోసం జూలై 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

ఇదిలాఉంటే అగ్నిపథ్ పథకం కింద దాదాపు 7,50,000 లక్షల మంది అభ్యర్థులు IAF(Indian Air Force)లో రిక్రూట్‌మెంట్ కోసం తమను తాము నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులు వైమానిక దళంలో 3,000 ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. IAF డేటా ప్రకారం.. వైమానిక దళానికి రక్షణ ఔత్సాహికుల నుండి 7,49,899 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాది 6,31,528 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. సాయుధ దళాలు ఈ సంవత్సరం 46,000 మంది అగ్నివీర్లను నియమించుకుంటాయి. సైన్యంలో 40వేల మంది, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ , నౌకాదళంలో ఒక్కొక్కటిదానిలో 3వేల మందిని చొప్పున భర్తీ చేసుకోనున్నారు.

Agnipath protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల‌ కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం

జూన్ 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా కేంద్రం పథకం అమలులో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఇదిలాఉంటే శుక్రవారం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకంపై చర్చించాలనే డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించింది. దీంతో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం నుండి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కెసి వేణుగోపాల్, ఉత్తమ్ రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన డానిష్ అలీలు అగ్నిపథ్ పథకం గురించి చర్చించాలని పట్టుబట్టారు.

ట్రెండింగ్ వార్తలు