HBD Dhoni: ఎంఎస్ ధోనికి బర్డే విషెస్.. రవీంద్ర జడేజా ట్వీట్ వైరల్.. రాయుడు ఏమన్నాడంటే..

ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విటర్ వేదికగా బర్డే విషెస్ చెప్పారు. అతడితో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

HBD MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni).. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ చెప్పినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ధోని పేరు మార్మోగిపోయింది. అతడు ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అభిమానులు హడావుడి చేశారు. ఈ రోజు అతడి 42 పుట్టినరోజు ( Dhoni Birthday). ధోనికి మాజీ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లు బర్డే విషెస్ చెబుతున్నారు. ‘మిస్టర్ కూల్’తో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చేసిన ట్వీట్ వైరల్ మారింది.

మహేంద్ర సింగ్ ధోనికి స్పెషల్ గా విషెస్ చెబుతూ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. 2009 నుంచి ధోనితో కలిసి ఆడుతున్నానని, తమ ప్రయాణం ఎప్పటికీ కొనసాగాలనే అర్ధం వచ్చేలా జడేజా ట్విటర్ లో రాసుకొచ్చాడు. అంతేకాదు వచ్చే ఐపీఎల్ లోనూ ధోని ఆడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. 2009 నుంచి ఇప్పటి వరకు ఈ మనిషితో నా ప్రయాణం కొనసాగుతోంది. ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. మహీ భాయ్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పసుపు రంగు(చెన్నై సూపర్ కింగ్స్)లో త్వరలో కలుద్దాం అని జడేజా ట్వీట్ చేశాడు.

Also Read: ధోని కిచిడీ సెంటిమెంట్‌ తెలుసా..? ఆ ప్ర‌పంచ‌క‌ప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?

తెలుగు క్రికెటర్లు అంబటి రాయుడు, తిలక్ వర్మ తదితరులు కూడా ధోనికి ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లెజెండ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాయుడు ట్వీట్ చేయగా.. హ్యపీ బర్డే మహీ భాయ్ అంటూ తిలవ్ వర్మ విషెస్ చెప్పాడు. వీరేంద్ర సెహ్వాగ్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, మయాంక్ అగర్వాల్, వరుణ్ చక్రవర్తి, వినయ్ కుమార్ తదితరులు ట్విటర్ లో ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు