Virat Kohli : లండన్‌లో కోహ్లి స్థిరనివాసం..? ఊహాగానాలకు 4 కారణాలు ఇవే..
ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్‌లోనే పర్మినెంట్‌గా ఉండబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 5, 2024 / 05:45 PM IST
Virat Kohli moving to London permanently
Virat Kohli – Anushka Sharma : ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్‌లోనే పర్మినెంట్‌గా ఉండబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. అయితే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విక్టరీ పరేడ్ తరువాత కోహ్లి లండన్ విమానం ఎక్కడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ప్రస్తుతం కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ కోహ్లిలతో ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత కోహ్లి, అనుష్కశర్మలు లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు వారు చెబుతున్నారు.
ఎక్కువగా లండన్‌లోనే..
గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ లండన్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి చుట్టు పక్కల ప్రదేశాలలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటున్నారు. 2023 డిసెంబర్లో కోహ్లి తన కుటుంబంతో కలిసి కొన్ని రోజులు లండన్ విహారయాత్రకు వెళ్లాడు. ఆ తర్వాత లండన్‌లోని ఓ రెస్టారెంట్లో అనుష్కతో కలిసి ఫొటోలు దిగారు.
Jasprit Bumrah : రిటైర్మెంట్ పై బుమ్రా కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడే మొదలు పెట్టా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్‌లో మళ్లీ కనిపించాడు. తండ్రీ, కూతురు రెస్టారెంట్లో ఉన్న ఫోటో అప్పట్లో వైరల్‌గా మారింది. అనుష్క శర్మ చివరిసారిగా జూన్ ప్రారంభంలో ముంబైలో కనిపించింది.
లండన్‌లో జన్మించిన అకాయ్ ?
కొడుకు పుట్టిన ఐదు రోజుల తరువాత విరుష్క జంట ఫిబ్రవరి 20న తమకు అకాయ్ జన్మించినట్లుగా ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు రాకుండా విరుష్క జంట జాగ్రత్తలు తీసుకోవడంతో అతడు విదేశాల్లో జన్మించినట్లుగా ఇంటర్నెట్ స్లీత్‌లు నిర్థారించారు. వాస్తవానికి ఆ సమయంలో ప్రచురించబడిన అనేక నివేదికలు అకాయ్ కోహ్లీ లండన్‌లోని ఆసుపత్రిలో జన్మించినట్లు సూచించాయి. రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు కోహ్లి లండన్‌కు వెళ్లాడని, అందుకనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడని వార్తలు వచ్చాయి.
Mahmudullah : టీ20 ప్రపంచకప్‌లో ఓటమి.. మరో స్టార్ ఆల్‌రౌండర్ క్రికెట్‌కు వీడ్కోలు..
కొడుకు జన్మించిన కొద్ది రోజులకు కోహ్లి లండన్‌లో ఉన్నఫోటోలు వైరల్ కావడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోన్నాడు అనే రూమర్లకు బలం చేకూరింది.
సాధారణ జీవితం గడిపేందుకు..
విరాట్ ఆటకు వీడ్కోలు పలికేందుకు చాలా దగ్గర ఉన్నాడు. కాబట్టి అతడు లండన్‌లో స్థిరనివాసం ఉంటే అవకాశం ఉంది. యూరప్‌లో ఉండటాన్ని చాలా ఇష్టపడతానని గతంలో ఓ సారి తెలిపాడు. ఎందుకంటే అక్కడ తనను పెద్దగా ఎవరూ గుర్తించరని, సాధారణ జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక మార్చి 2024లో ఇంగ్లాండ్‌లో తన కుమార్తె వామికతో సంతోషంగా సమయాన్ని గడిపినట్లు కోహ్లి చెప్పిన సంగతి తెలిసిందే.
లండన్‌లో లిస్టెడ్ కంపెనీ..
విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ లిస్ట్ అయ్యారు. ఇది ఓ మేనేజ్మెంట్ కంపెనీ. ఆగస్టు 1, 2022న దీన్ని స్థాపించారు. UKలోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ముగ్గురు డైరెక్టర్లు ఉండగా.. వీరిలో ఇద్దరు కోహ్లి, అనుష్క.
