Jasprit Bumrah : రిటైర్‌మెంట్ పై బుమ్రా కీల‌క వ్యాఖ్య‌లు.. ఇప్పుడే మొద‌లు పెట్టా..

భారత జ‌ట్టు విశ్వ‌విజేత‌గా నిలిచిన‌ కొద్ది గంట్ల‌లోనే స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు.

Jasprit Bumrah : రిటైర్‌మెంట్ పై బుమ్రా కీల‌క వ్యాఖ్య‌లు.. ఇప్పుడే మొద‌లు పెట్టా..

Jasprit Bumrah

టీమ్ఇండియా 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. భారత జ‌ట్టు విశ్వ‌విజేత‌గా నిలిచిన‌ కొద్ది గంట్ల‌లోనే స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు. దీంతో చాలా మంది దృష్టి పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ప‌డింది. అత‌డు ఏమైన సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటాడా అనే అనుమానం క‌లిగింది. అదే స‌మ‌యంలో బుమ్రా ఎంత కాలం ఆడితే అంత వ‌ర‌కు జ‌ట్టులోనే కొన‌సాగించాల‌ని విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా స్టార్ ఆటగాడు కోహ్లి సైతం సూచించాడు.

ఈ క్ర‌మంలో త‌న రిటైర్‌మైంట్ ప్ర‌ణాళిక‌ల‌పై బుమ్రా వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్పందించాడు. త‌న వ‌ర‌కు అయితే ఇప్ప‌ట్లో వీడ్కోలు ప‌లికే ఆలోచ‌న లేద‌న్నాడు. అది ఇంకా చాలా దూరంలో ఉంద‌న్నాడు. తానిప్పుడే మొద‌లు పెట్టాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు సాధించిన దానికి ఆనందంగా ఉన్న‌ట్లు చెప్పాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించి ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌రువాత అభిమానుల స్వాగ‌తాన్ని త‌న జీవితంలో మ‌రిచిపోలేన‌న్నాడు.

Mohammed Siraj : హైదరాబాద్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ రోడ్ షో.. ముంబై విజ‌యోత్సవ ర్యాలీని రీక్రియేట్ చేద్దామా..!

ముంబైలోని వీధుల‌న్నీ అభిమానుల‌తో కిక్కిరిసిపోయాయని, త‌న కెరీర్‌లో ఇలాంటి అనుభ‌వం ఎప్పుడు ఎదురుకాలేద‌న్నాడు. భావోద్వేగాల‌ను నియంత్రించుకోవ‌డం చాలా క‌ష్టమైంద‌న్నాడు. ఇప్ప‌టికి త‌న‌ను తాను ఓ యువ ఆట‌గాడిగానే భావిస్తాన‌ని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ‌క‌ప్ సాధించేందుకు టీమ్ఇండియా సీనియ‌ర్లు, కుర్రాళ్ల‌తో బ‌రిలోకి దిగింద‌ని, ప్ర‌తీ మ్యాచుల్లోనూ గెలవ‌గ‌లం అనే న‌మ్మ‌కంతోనే ఆడిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇక స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌కు ల‌క్ష్యం ఏంటో అన్న‌దానిపై చాలా స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌న్నాడు. జ‌ట్టును ముందు ఉండి న‌డిపించారు. ఈ విజ‌యంతో దేశానికి మ‌రింత వ‌న్నె తెచ్చిన‌ట్లైంద‌ని తెలిపాడు. ఇక త‌న కెరీర్‌లో ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎన్న‌డూ గెల‌వ‌లేద‌ని, త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్తుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని బుమ్రా అన్నాడు.

కాగా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌డంలో బుమ్రా కీల‌క పాత్ర పోషించాడు. 8.26 ఎకాన‌మీతో 15 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

Pakistan cricketers : మీ దుంప‌లు తెగ‌.. ఓ దుప్ప‌టి, దిండు కూడా తెచ్చుకోక‌పోయారా..? ప‌రుపుల‌పై పాక్ ఆటగాళ్ల క్యాచింగ్ ప్రాక్టీస్‌..