Suryakumar Yadav : కొత్త వీడియో.. సూర్య‌కుమార్ క్యాచ్ వివాదానికి తెర‌.. మీరు చూసేయండి

సూర్య బౌండ‌రీ లైన్ వ‌ద్ద ప‌ట్టిన ఈ క‌ళ్లు చెదిరే క్యాచ్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఓ బెస్ట్ క్యాచ్‌గా నిలిచిపోయింది.

Fresh Video Angle Puts Suryakumar Yadav Catch Controversy To Rest

వెస్టిండీస్‌లోని బార్బ‌డోస్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ 7 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ద‌క్షిణాఫ్రికా విధ్వంస‌క‌ర ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ భారీ షాట్ కొట్ట‌గా.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. సూర్య ఈ క్యాచ్ ప‌ట్ట‌డంతో భార‌త్ విజ‌యావ‌కాశాలు మెరుగు అయ్యాయి.

కాగా.. సూర్య బౌండ‌రీ లైన్ వ‌ద్ద ప‌ట్టిన ఈ క‌ళ్లు చెదిరే క్యాచ్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఓ బెస్ట్ క్యాచ్‌గా నిలిచిపోయింది. అయితే.. ఈ క్యాచ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో అంతే వివాదాస్ప‌ద‌మైంది. ఈ క్యాచ్ పై కొంద‌రు నెటిజ‌న్లు సందేహాలు వ్య‌క్తం చేశారు. బంతిని అందుకునే క్ర‌మంలో సూర్య బౌండ‌రీ లైన్‌ను తాక‌డ‌ని ఆరోపించారు. త‌మ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని చెబుతూ కొన్ని అస్ప‌ష్ట‌మైన వీడియోలు షేర్ చేశారు.

IND vs ZIM : తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్ మార్క్‌.. రుతురాజ్‌కు షాక్‌..

అయితే.. తాజాగా ఓ వీడియోలో సూర్య‌కుమార్ యాద‌వ్ క్లీన్ క్యాచ్ అందుకున్న‌ట్లు కనిపించింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోతో అంద‌రి అనుమానాలు తొలిగిపోనున్నాయి.

త‌న స్ట‌న్నింగ్ క్యాచ్ పై మ్యాచ్ అనంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడాడు. తాను ప‌ట్టిన ఆ క్యాచ్ వెనుక ఎంతో ప్రాక్టీస్ ఉంద‌న్నాడు. వివిధ మైదానాల్లో గాలికి త‌గ్గ‌ట్లుగా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాన‌న్నాడు. ఫైన‌ల్లో నేను కాస్త దూరం నిలుచున్నాను. వైడ్ యార్క‌ర్ వేయాల‌నే ప్లాన్‌లో భాగంగా రోహిత్ భాయ్‌, హార్దిక్ భాయ్ న‌న్ను దూరంగా నిల‌బెట్టారు. అయితే.. మిల్ల‌ర్ స్ట్రైట్ షాట్ ఆడాడు. దాన్ని చూసిన నేను బంతిని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని అనుకున్నాను. వెంట‌నే ప‌రుగెత్తి బంతిని అందుకున్నాను. రోహిత్ శ‌ర్మ స‌మీపంలో ఉంటే అత‌డికే విసిరేద్దామ‌నుకున్నా.. కానీ స‌మీపంలో లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ నేనే అందుకున్నా అని సూర్య అన్నాడు.

Hardik Pandya : కొడుకు మెడ‌లో మెడ‌ల్ వేసి హార్దిక్ సంబ‌రాలు.. క‌నిపించ‌ని భార్య నటాసా స్టాంకోవిక్..