IND vs ZIM : తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్ మార్క్‌.. రుతురాజ్‌కు షాక్‌..

ఛాంపియ‌న్ హోదాలో టీమ్ఇండియా తొలి సిరీస్ ఆడ‌బోతుంది.

IND vs ZIM : తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్ మార్క్‌.. రుతురాజ్‌కు షాక్‌..

Shubman Gill Reveals New Opening Partner For 1st T20I vs Zimbabwe

Updated On : July 6, 2024 / 10:56 AM IST

IND vs ZIM 1st T20 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ముగిసింది. టీమ్ఇండియా ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఇక ఛాంపియ‌న్ హోదాలో తొలి సిరీస్ ఆడ‌బోతుంది. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు సిద్ద‌మైంది. తొలి టీ20 మ్యాచ్ నేటి (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4.30 మొద‌టి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆట‌గాళ్లుకు విశ్రాంతి ఇవ్వ‌డంతో త‌మ‌ని తాము నిరూపించుకునేందుకు జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఇది ఓ సువ‌ర్ణావ‌కాశం.

తొలి టీ20 మ్యాచ్‌లో ఎవ‌రు ఓపెనింగ్ చేస్తార‌నే విష‌యాన్ని కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ వెల్ల‌డించాడు. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి తాను ఓపెనింగ్ చేయ‌నున్న‌ట్లు గిల్ చెప్పాడు. వ‌న్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడ‌తాడ‌ని తెలిపాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి లు ఓపెనింగ్ చేశారు. వారిద్ద‌రూ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పారు. నేను టీ20ల్లో ఓపెనింగ్ చేశాను. కాబ‌ట్టి నేనే ఓపెన‌ర్‌గా రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు గిల్ అన్నాడు.

Hardik Pandya : కొడుకు మెడ‌లో మెడ‌ల్ వేసి హార్దిక్ సంబ‌రాలు.. క‌నిపించ‌ని భార్య నటాసా స్టాంకోవిక్..

అంత‌ర్జాతీయ క్రికెట్ అంటే ఒత్తిడి ఉంటుందని, కుర్రాళ్లు దాన్ని అధిగ‌మించాల‌ని సూచించాడు. త‌న‌తో పాటు జ‌ట్టులో చాలా మంది యువ ఆట‌గాళ్లు ఉన్నార‌న్నాడు. కొంద‌రు ప్లేయ‌ర్లు అరంగ్రేటం చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇక జింబాబ్వేను త‌క్కువగా అంచ‌నా వేయ‌డం లేద‌న్నాడు. సికింద‌ర్ ర‌జా నేతృత్వంలోని జింబాబ్వే గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నామ‌న్నాడు. ఏ మాత్రం ఏమ‌ర పాటుగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌న్నాడు.

ఐపీఎల్ స్టార్ల‌కు ఛాన్స్‌..

ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్‌, ధృవ్ జురెల్ వంటి ఆట‌గాళ్లు అద‌ర‌గొట్టారు. అభిషేక్ 16 మ్యాచుల్లో 204.22 స్ట్రైక్‌రేటుతో 484 ప‌రుగులు చేశాడు. ప‌రాగ్ 15 మ్యాచుల్లో 149 స్ట్రైక్‌రేటుతో 573 ప‌రుగులు చేశాడు. వీరిలో అభిషేక్ అరంగ్రేటం ఖాయమైంది. మ‌రీ రియాన్ ప‌రాగ్ తుది జ‌ట్టులో ఆడ‌తాడో లేదో చూడాల్సి ఉంది. వికెట్ కీప‌ర్ గా దృవ్ జురెల్ ఆడ‌నున్నాడు. నయా ఫినిషర్ రింకూ సింగ్ ఆరో స్థానంలో తుది జ‌ట్టులోకి రానున్నాడు.

Jasprit Bumrah : రిటైర్‌మెంట్ పై బుమ్రా కీల‌క వ్యాఖ్య‌లు.. ఇప్పుడే మొద‌లు పెట్టా..

ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఛాన్స్ ద‌క్క‌నుంది. సుందర్‌తో రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్య‌త‌ల‌ను పంచుకోవ‌చ్చు. ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ పేస్ బాధ్యతలు మోయ‌నున్నారు. ఇక అంద‌రూ యువకులే కావడంతో జట్టు కూర్పుపై కాస్త గందరగోళం నెలకొంది. తాత్కాలికంగా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ గిల్ ఎలాంటి జ‌ట్టుతో ముందుకు వెళ‌తారోన‌న్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.