Hardik Pandya celebrates his World Cup win with son Agastya
టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. పొట్టి ప్రపంచ కప్ గెలిచి వారం రోజులు దాటినప్పటికి కూడా దేశంలో సంబరాలు ఆడగం లేదు. ప్రధానితో భేటీ, విజయోత్సవ పరేడ్ తరువాత ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దాదాపు నెల రోజుల విరామం తరువాత కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పలువురు క్రికెటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఇక టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంటికి చేరిన హార్దిక్ తన కొడుకు అగస్త్యతో కలిసి అతడు సంబరాలు చేసుకున్నాడు. ప్రపంచకప్ విజయంతో తనకు దక్కిన మెడల్‌ను కొడుకు మెడలో వేసి మురిసిపోయాడు.
Virat Kohli : లండన్‌లో కోహ్లి స్థిరనివాసం..? ఊహాగానాలకు 4 కారణాలు ఇవే..
ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నేను ఏమి చేసినా, నేను నీ కోసమే చేస్తాను..’ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా హార్దిక్ భార్య నటాసా స్టాంకోవిక్ కనిపించలేదు.
దీంతో నటాషా-హార్దిక్ విడాకుల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై అటు నటాసా, ఇటు హార్దిక్ ఎవ్వరూ స్పందించలేదు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
Jasprit Bumrah : రిటైర్‌మెంట్ పై బుమ్రా కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడే మొదలు పెట్టా..
అదే సమయంలో ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. నటాసా మాత్రం ఇంత వరకు సోషల్ మీడియా వేదికగా కూడా అభినందనలు తెలియజేయలేదు. ఇప్పుడు హార్దిక్ పోస్ట్ చేసిన ఫోటోల్లోనూ ఆమె కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.