Pic Credit: @ZimCricketv twitter
జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోయింది. యువ ప్లేయర్లతో కూడిన టీమిండియా బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది.జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. శుభ్‌మన్ గిల్ (31 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (27) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ సరైన ఆటతీరు ప్రదర్శించలేదు. దీంతో టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. 13 పరుగుల తేడాతో జింబాబ్వే విజయ దుందుభి మోగించింది.
టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ 7, పరాగ్ 2, శుభ్‌మన్ గిల్ 31, ధ్రువ్ 7, వాషింగ్టన్ సుందర్ 27, రవి బిష్ణోయి 9, ఆవేశ్ ఖాన్ 16 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రజా 3, ఛటారా 3, ల్యూక్, ముజరబనీ, వెల్లింగ్టన్, బ్రియాన్ కు ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి.
అంతకు ముందు జింబాబ్వే జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. మదండే (29 నాటౌట్) బ్రియాన్ బెన్నెట్ (23), డియోన్ మైయర్స్ (23), వెస్లీ మాధేవేరే (21), రజా (17) పరుగులు బాదారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్ నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.
Also Read : ఏంటయ్యా రోహిత్.. సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించేస్తావా..?