Rohit Sharma : ఏంటయ్యా రోహిత్.. సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించేస్తావా..?
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులు దాటినప్పటికి కూడా విజయోత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Rohit Sharma takes hilarious jibe on Suryakumar Yadav catch in T20 World Cup
Rohit Sharma – Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులు దాటినప్పటికి కూడా విజయోత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబైలో విజయోత్సవ యాత్ర తరువాత ప్లేయర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారి వారి స్వస్థలాల్లో ఆటగాళ్లకు ఘన స్వాగతం లభిస్తోంది.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్‌లను విధాన్ భవన్‌కు ఆహ్వానించింది. సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ సందర్భంగా ఆటగాళ్లను సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మరాఠీలో మాట్లాడాడు. తమను ఆహ్వానించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశాడు.
IND vs ZIM : తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్ మార్క్.. రుతురాజ్‌కు షాక్..
అనంతరం టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడాడు. సూర్యను మెచ్చుకున్నాడు. ఒకవేళ ఆ క్యాచ్ గనుక అతడు మిస్ చేసి ఉంటే జట్టు నుంచి తప్పించి ఉండేవాడినని రోహిత్ ఫన్నీగా అన్నాడు. ‘బాల్ అతడి చేతిలో సేఫ్‌గా పడడం బాగుంది. లేదంటే జట్టు నుంచి తప్పించేవాడిని.’ అని నవ్వుతూ రోహిత్ అన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు.
11 ఏళ్లుగా ఎదురుచూశాం..
టీమ్ఇండియాకు ప్రపంచకప్‌ను తీసుకురావడం తన కల అని రోహిత్ అన్నాడు. దాదాపు 11 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీని ఇంటికి తీసుకొచ్చామన్నారు. 2013లో టీమ్ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఉన్న శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్‌లకే కాకుండా మిగిలిన సహచర ఆటగాళ్లతో పాటు భారత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు.
Rohit Sharma – Achcha huwa Surya ke hath mein catch baith Gaya, warna aage main usse baitha deta.
– Rohit is a box office! ?? pic.twitter.com/T6IItYtfmU
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2024