Hardik Pandya : ముద్దులతో హార్దిక్ పాండ్యా ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఇషాన్..! నీ ప్రేమ తగలెయ్య.. కాస్త వదలవయ్యా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.

Ishan Kishan charges at Hardik Pandya for a kiss on the sofa
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. జట్టుకు అవసరమైన సమయంలో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. విశ్వ విజేతగా నిలిచిన అనంతరం నాలుగు రోజుల తరువాత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. ముంబైలో విజయోత్సవ ర్యాలీ అనంతరం ప్లేయర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
గత కొన్నాళ్లుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన ఇంట్లో సేద తీరుతున్నాడు. ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. టీమ్ఇండియా వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాపెట్టకుండా హార్దిక్ ఇంటికి వెళ్లాడు. అతడికి అభినందలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఆ వీడియోలో ఏం ఉందంటే..? ఫోను చూసుకుంటుండగా తన వద్దకు వచ్చిన ఇషాన్ ను చూసి పాండ్యా సర్‌ప్రైజ్ అయ్యాడు. వెంటనే ఇద్దరు కౌగిలించుకున్నారు. సంతోషంతో పాండ్య కుడి వైపు బుగ్గపై ఇషాన్ ముద్దు పెట్టాడు. ఆ వెంటనే పాండ్యా ఇటు సైటు కూడా పెట్టమని చెప్పగా ఎడమ వైపు సైతం ముద్దు పెట్టాడు.
Suryakumar Yadav : కొత్త వీడియో.. సూర్యకుమార్ క్యాచ్ వివాదానికి తెర.. మీరు చూసేయండి
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఇషాన్ కిషన్.’ గత కొన్ని నెలలుగా నువ్వు ఎన్నో విషయాలను ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ ఎంతో ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉన్నావు. ఈ రోజు నీ కష్టానికి తగి ప్రతి ఫలాన్ని పొందావు. ఇలాంటి విజయాలను నువ్వు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. నీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు ఓ ఛాంపియన్ వి అంటూ రాసుకొచ్చాడు.’ ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా హార్దిక్ పాండ్యా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి పాండ్యాకు నాయకత్వం అప్పగించడం అప్పట్లో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో మైదానంలో, బయట ఎక్కడ పాండ్యా కనిపించినా గానీ అతడిని హేళన చేశారు. అటు ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌కు చేరుకోకపోవడంతో మరిన్ని అవమానాలను ఎదుర్కొన్నాడు. అదే సమయంలో అతడి వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటి అన్నింటి నడుమ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
IND vs ZIM : తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్ మార్క్.. రుతురాజ్‌కు షాక్..
View this post on Instagram