Virender Sehwag : ధోని కిచిడీ సెంటిమెంట్‌ తెలుసా..? ఆ ప్ర‌పంచ‌క‌ప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?

భార‌త మాజీ డ్యాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తికర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. మ‌హేంద్ర సింగ్ ధోని కేవ‌లం కిచిడీ మాత్ర‌మే తిన్నాడ‌ని చెప్పాడు.

Virender Sehwag-MS Dhoni : పురుషుల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ 19 న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 8న చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో ఆడ‌నుంది. 12 సంవ‌త్స‌రాల క్రితం 2011లో మ‌హేంద్ర సింగ్ ధోని సార‌థ్యంలో టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచింది. స్వదేశంలో మెగాటోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ సారి ఎలాగైన భార‌త్ విజ‌యం సాధించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో భార‌త మాజీ డ్యాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తికర విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

Rishabh Pant : గ్యాంగ్‌ను క‌ల‌వ‌డం ఎప్పుడూ సంతోష‌మే.. పిక్ వైర‌ల్‌

2011 ప్ర‌పంచ క‌ప్‌లో అప్ప‌టి కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని కేవ‌లం కిచిడీ మాత్ర‌మే తిన్నాడ‌ని చెప్పాడు. ఇది అత‌డి సెంటిమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఆ మెగా టోర్నీలో ధోని బ్యాట‌ర్‌గా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ టీమ్ఇండియా మ్యాచ్‌లు గెల‌వ‌డంతో మ‌హేంద్రుడు కిచిడీ సెంటిమెంట్‌ను కొన‌సాగించాడ‌ని సెహ్వాగ్ తెలిపాడు. “వాస్త‌వానికి ప్ర‌తి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. వారు దానిని త‌ప్ప‌క కొన‌సాగిస్తారు. అలాగే ధోనికి కూడా కిచిడీ సెంటిమెంట్ ఉంది. దీని గురించి అత‌డిని అడిగితే నేను ప‌రుగులు చేయ‌క‌పోయినా.. ఈ సెంటిమెంట్ బాగా ప‌ని చేస్తోంది.. భార‌త్ మ్యాచ్‌లు గెలుస్తోంది గ‌దా.” అని ధోని చెప్పిన‌ట్లు సెహ్వాగ్ తెలిపాడు.

ఫైన‌ల్ మ్యాచ్ ముందు వ‌ర‌కు ధోని ఎనిమిది మ్యాచులు ఆడ‌గా కేవ‌లం 150 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే.. శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో మాత్రం మ‌హేంద్రుడు అద‌ర‌గొట్టాడు. 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 91 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి జ‌ట్టును గెలిపించాడు. సిక్స్‌తో ధోని విజ‌యాన్ని అందించ‌డం స‌గ‌టు భార‌త క్రీడాభిమాని అంత తొంద‌ర‌గా మ‌రిచిపోడు.

ICC World Cup 2023 : ఒక‌వేళ పాకిస్థాన్ సెమీఫైన‌ల్‌కు వ‌స్తే.. జ‌రిగేది ఇదే..

ఇక త‌న జీవితంలో ప్ర‌పంచ ఆడ‌డం అంటే ఒలింపిక్స్‌తో స‌మానం అని సెహ్వాగ్ అన్నాడు. తాను ఆడిన‌ప్పుడు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ల‌లో ఓ సారి ఫైన‌ల్‌(2003లో) ఓడిపోయాం. మ‌రోసారి(2011లో) గెలిచాం. ఇంకోసారి గ్రూప్ ద‌శ(2007లో) నుంచే నిష్క్ర‌మించిన‌ట్లు తెలిపాడు. త‌న ప్ర‌యాణం ఒడిదొడుకుల‌తో సాగింది అంటూ అంటూ సెహ్వాగ్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు