Naga Chaitanya : డెడికేషన్ అంటే ఇదీ.. నాగ చైతన్య ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్..!

చైతు వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ‘డెడికేషన్ అంటే ఇదీ’.. అంటూ చైతు ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు..

Naga Chaitanya: కండలు తిరిగిన బాడీతో..  తెరమీద ఒక్క దెబ్బతో వంద మందిని ఒంటి చేత్తో మట్టికరిపించే హీరోలు.. తెరవెనుక ఆ బాడీ షేప్ కోసం చాలా కష్టపడతారు. ఇప్పుడున్న యంగ్ హీరోలైతే సినిమా సినిమాకి ఫిజిక్‌ పరంగా వేరియేషన్ చూపిస్తున్నారు.

తాజాగా యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా అదే పనిలో ఉన్నారు. గంటల తరబడి జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ.. కొత్త సినిమా కోసం తన బాడీ బిల్డ్ చేసుకుంటున్నారు. నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘థాంక్యూ’..

‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.రవి కథ, మాటలు అందిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 20వ సినిమా ఇది.

ప్రస్తుతం షూటింగ్ లాస్ట్ స్టేజ్‌కు చేరుకుంది. చైతు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది. తర్వాత చెయ్యబోయే సినిమా కోసం చై.. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారు. చైతు వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డెడికేషన్ అంటే ఇదీ’.. అంటూ చైతు ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.

అయితే చైతు ఇంతలా కష్టపడుతుంది కొత్త సినిమా కోసం కాదు.. ‘థ్యాంక్యూ’ లోనే మరో రోల్ కోసం అని వార్తలు వచ్చాయి కానీ అసలు మేటర్ ఏంటంటే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’  మూవీతో చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తను చెయ్యబోనే క్యారెక్టర్ కోసమే చై, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సిక్స్ ప్యాక్‌లో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. మొత్తానికి ఒకే ఒక్క వర్కౌట్ వీడియోతో తన హిందీ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ పై అంచనాలు పెంచేశాడు యువసామ్రాట్.

Naga Chaitanya Bollywood Entry : ఆమిర్ ఖాన్ సినిమాతో చైతు బాలీవుడ్ ఎంట్రీ..

ట్రెండింగ్ వార్తలు