IPL 2024 : సీఎస్కేపై థ్రిల్లింగ్ విక్టరీ తరువాత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆసక్తిక వ్యాఖ్యలు

మ్యాచ్ చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నందున ఆందోళన చెందాం. అతను అద్భుత మ్యాచ్ ఫినిషర్. కానీ, మా బౌలర్లు అద్భుత బౌలింగ్ చేశారని డూప్లెసిస్ అన్నాడు.

Faf Du Plessis

RCB vs CSK : చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడి ఓడింది. ఫలితంగా సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. చెన్నై ప్లేయర్లలో రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, రవీంద్ర జడేజా (42 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Also Read : RCB vs CSK : ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. పోరాడి ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ

మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మాట్లాడుతూ.. ‘వాట్ ఎ నైట్ .. ఇన్‌క్రెడిబుల్’ ఇక్కడి వాతావరణాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ లో ఇలా గెలవడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని అన్నాడు. ఇలాంటి పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు తాను ఆడిన పిచ్ లలో ఇదే అత్యంత సవాళ్లతో కూడుకున్నది. వర్షం తరువాత నేను, విరాట్ కూడా 140-150 పరుగులు అనుకున్నాం. ఈ పిచ్ పై 200 పరుగుల మార్క్ దాటడం చాలా విశేషమైనది. మా బ్యాట్స్ మెన్ అద్భుతమైన బ్యాటింగ్ ను కనబర్చారు.

Also Read : Mark Boucher : రోహిత్ శ‌ర్మ భ‌విష్య‌త్తుపై ముంబై కోచ్ బౌచర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. గ‌త రాత్రే మాట్లాడా..

మ్యాచ్ చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నందున ఆందోళన చెందాం. అతను అద్భుత మ్యాచ్ ఫినిషర్. కానీ, మా బౌలర్లు అద్భుత బౌలింగ్ చేశారని డూప్లెసిస్ అన్నాడు. వరుసగా ఆరు మ్యాచ్ లలో విజయం సాధించడం సంతోషంగా ఉంది. సీజన్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొనప్పటికీ చివరకు ప్లే ఆఫ్స్ కు చేరుకోవటం సంతోషంగా ఉంది. ఇక నాకౌట్ మ్యాచ్ లకు సిద్ధమవుతామని ఫాఫ్ డూప్లెసిస్ అన్నారు.