Dasara Movie: దసరా ‘ఓరి వారి’ సాంగ్.. చివరి నిమిషంలో మార్పులు!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ రిలీజ్‌కు దగ్గరవుతుండటంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే హైప్ క్రియేట్ చేయగా, తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు ఈ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ రిలీజ్‌కు దగ్గరవుతుండటంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే హైప్ క్రియేట్ చేయగా, తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు ఈ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Dasara Movie: దసరా నుండి నాని మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

దసరా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో ఈ బ్రేకప్ సాంగ్ కోసం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే చివరి నిమిషంలో ఈ రెండో లిరికల్ సాంగ్‌ను కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మిగతా భాషల్లో ఈ పాటను రేపు ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఇతర భాషల్లో ఈ బ్రేకప్ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది.

ఇక తెలుగులో రిలీజ్ అయిన ‘ఓరి వారి’ బ్రేకప్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రేమలో విఫలమైన ప్రేమికుడు ఎలాంటి బాధలో ఉంటాడనేది మనకు ఈ పాట రూపంలో తెలిపారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ స్వయంగా పాడటం విశేషం. ఇక ఈ సినిమాలో నాని రస్టిక్ లుక్‌లో రెచ్చిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తుండగా మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు