Tollywood : ఇండియన్ సినిమాకి పాన్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది టాలీవుడ్.. నేపాలీ సూపర్ స్టార్!

ఇటీవల జరిగిన INDO - NEPAL CINEMA EXCHANGE SUMMIT 2023 లో నేపాలీ సూపర్ స్టార్ భువన్ కెసి తెలుగు సినిమాలు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Tollywood : ప్రస్తుతం ఎక్కడ చూసిన తెలుగు సినిమాల హవానే కనిపిస్తుంది. రాజమౌళి తన సినిమాలు బాహుబలి, RRR తో గ్లోబల్ మార్కెట్ కి దారి వేశాడు. ఆ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ మన సినిమాలకు ఆదరణ పెరిగింది. తెలుగు సినిమాలు చూసేందుకు గ్లోబల్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. హాలీవుడ్ దర్శకులు సైతం RRR వంటి సినిమాలకు మద్దతు ఇస్తామంటూ మీడియా వేదిక ప్రకటిస్తున్నారు.

Pushpa 2 : పుష్ప గెటప్‌ కోసం డేవిడ్ వార్నర్.. రూ.10,001 ఎవరకి పంపించాడు?

తాజాగా నేపాలీ సూపర్ స్టార్ తెలుగు సినిమాలు గురించి వ్యాఖ్యానించిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FTPC), నేపాల్ ఫిల్మ్ ప్రమోషన్ సర్క్యూట్‌తో కలిసి ఇటీవల ఖాట్మండులోని నేపాల్ ఫిల్మ్ బోర్డ్ ఆడిటోరియంలో INDO – NEPAL CINEMA EXCHANGE SUMMIT 2023 పేరిట ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నేపాలీ సూపర్ స్టార్ భువన్ కెసి (Bhuwan K C), ఆయుష్మాన్ జోషి (Ayushman Joshi) తో పాటు పలువురు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Virupaksha : సినిమా హిట్టు అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్.. ఏమైంది?

ఈ సమ్మిట్ లో నేపాల్ ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతూ.. అనేక భారతీయ సినిమాలు మా లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొని మా పర్యాటక రంగానికి సహాయపడాయి. వాటిలో తెలుగు సినిమా ‘ఇంట్లో ఇల్లాలు వంటింటిలో ప్రియురాలు’ కూడా ఉంది. మేము కూడా ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ అరకు లోయ, కోనసీమ, తెలంగాణలోని చార్మినార్, రామోజీ ఫిల్మ్ సిటీ, కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో షూటింగ్స్ జరుపుకున్నాము అంటూ తెలియజేశారు.

Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

అలాగే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ కూడా ఇరు పరిశ్రమల్లో పని చేస్తే మరింత భారతీయ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ వెల్లడించారు. ఇక ఇదే సమ్మిట్ లో భువన్ కెసి, ఆయుష్మాన్ జోషి మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు పాన్ గ్లోబల్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది తెలుగు సినిమాలు అనడంలో సందేహం లేదు. తెలుగు చిత్రాలు వల్ల నేడు ఇతర దేశాలు వారు ఇతర కంట్రీస్ మూవీస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు