Netflix : మొన్న తెలుగు.. ఇప్పుడు తమిళ్.. వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్

తమిళ్ సినిమాలని కూడా ప్రకటించి తమిళ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. తమిళ్ లో అయితే ఏకంగా 18 సినిమాలు ప్రకటించింది. వీటిలో కూడా చాలా వరకు షూటింగ్ లో ఉన్న సినిమాలే. వీటిలో.............

Netflix :  మన తెలుగు వాళ్ళకే కాదు దేశమంతటా సంక్రాంతి పెద్ద పండుగే. తమిళ్ వాళ్ళు కూడా పొంగల్ అని గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని తెలిసిందే. ఇటీవల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక ఓటీటీలో వస్తాయి. సినిమా విజయాన్ని బట్టి థియేటర్లో రిలీజయిన ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి రావాలని నిర్మాతలు, ఓటీటీ నిర్వాహకులు ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని సినిమాలని అయితే రిలీజ్ కి ముందే వాటికి ఉన్న క్రేజ్ ని బట్టి, ఆ హీరోలకి ఉన్న డిమాండ్ ని బట్టి ఓటీటీ నిర్వాహకులు తీసుకుంటారు. బడ్జెట్, ప్రమోషన్స్ కలిసొస్తుందని నిర్మాతలు కూడా ముందే కొన్ని సినిమాలకి ఓటీటీ పార్ట్నర్స్ ని లాక్ చేసుకుంటారు.

టాప్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని రోజులుగా ఇండియాలో, రీజనల్ లాంగ్వేజెస్ లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే లోకల్ భాషల సినిమాలని వరుసగా తమ ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. ఇటీవలే తాజాగా సంక్రాంతికి ఒకేరోజు 16 తెలుగు సినిమాలని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో చాలా వరకు ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాలే ఉన్నాయి. ఈ సినిమాలతో ముందే ఒప్పందం కుదుర్చుకొని అవి థియేటర్ లో రిలీజ్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవుతాయని ప్రకటించింది. ఇందులో చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమాలు ఉన్నాయి.

Dil Raju : ఆ ముగ్గురి దర్శకులతో దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాలు.. టైటిల్సే ఓ రేంజ్‌లో ఉన్నాయి..

అలాగే తాజాగా తమిళ్ సినిమాలని కూడా ప్రకటించి తమిళ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. తమిళ్ లో అయితే ఏకంగా 18 సినిమాలు ప్రకటించింది. వీటిలో కూడా చాలా వరకు షూటింగ్ లో ఉన్న సినిమాలే. వీటిలో అజిత్ 62వ సినిమా, విష్ణు విశాల్ ‘ఆర్యన్’, చంద్రముఖి 2, జయం రవి ఇరైవన్, ఇరుగుపత్రు, కార్తీ జపాన్, జిగర్ తాండ్ర 2, మమనాన్, నా శేఖర్ రిటర్న్స్, మట్టి కుస్తీ, లైకా ప్రొడక్షన్ 18వ సినిమా, ప్రొడక్షన్ 20, ప్రొడక్షన్ 24, కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, సముద్రఖని తలైకూతల్, సూర్య తంగాళం, ధనుష్ సర్, జీవా వరలారు ముఖ్యం సినిమాలని ప్రకటించింది. ఇవే కాకుండా మరో పెద్ద అప్డేట్ త్వరలో ఇస్తామని కూడా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.

ట్రెండింగ్ వార్తలు