Dosha video goes viral : ‘ఆహారాన్ని వృధా చేయడం మానేయండి’ వైరల్ వీడియోలు చూసి మండిపడుతున్న నెటిజన్లు

ఇటీవల కాలంలో చాలామంది రకరకాల కాంబినేషన్లలో వంటకాలు తయారు చేస్తూ వైరల్ అవుతున్నారు. జైపూర్‌లోని ఓ దోశ కేఫ్‌లో యువకుడు రవ్వ దోశ వేసిన విధానం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఓవైపు తిండి దొరక్క ఎంతోమంది అల్లాడుతుంటే ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Netizens say don’t waste food : ఇటీవల కాలంలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తూ చాలామంది వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా ఓ వ్యక్తి దోశ తయారీ విధానం చూసిన నెటిజన్లు ‘ఆహారాన్ని వృధా చేయడం మానేయండి’ అంటూ పిలుపు ఇస్తున్నారు.

Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్

జైపూర్ మాల్వియా నగర్ లో ఉండే తమిళ్ దోశ కేఫ్ గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఇక్కడ ఓ వ్యక్తి వేసిన రవ్వ దోశ వైరల్ అవుతోంది. దోశ చూస్తే రుచికరంగా ఉండే ఉంటుంది అనిపించింది. కానీ ఇది తయారు చేసేటపుడు అతను వేస్ట్ చేసిన పిండి, నూనె ఇతర పదార్ధాలు చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో food.india93 అనే యూజర్ ద్వారా పోస్ట్ చేయబడిన ఈ వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. అతను దోశ వేసే విధానం వల్ల ఎంతో ఆహారం వృధా అవుతోందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

ఏనుగు వైరల్ వీడియో: ఇష్టమైన ఫుడ్ దొరికితే మనసు ఆగుతుందా?

‘ఇది అద్భుతం కాదు.. ఆహారాన్నివృధా చేసే మూర్ఖపు చర్య’ అని ఒకరు.. ‘80% ఫుడ్‌లో 20% రోడ్డుమీదే ఉందని’ మరొకరు కామెంట్లు పెట్టారు. ఒకవైపు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ వీడియోల పేరుతో చాలామంది రకరకాల వంటలు చేస్తూ ఎంతో ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఇకపైన అయినా ఇలాంటి పనులు మానుకోవాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు