Integrated Cultivation : ప్రకృతి విధానంలో.. ఇంటిగ్రేటెడ్ సాగు చేస్తున్న ఎన్నారై

రైతు సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయాలనే కోరిక. అయితే తండ్రి కోరిక మేరకు కెమికల్ ఇంజనీరు చదివి.. విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తన కుమారి పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.

Integrated Cultivation : అతనో ఎన్నారై. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఏ గ్రేడ్ ఉద్యోగాలు చేశారు. నెలకు పది లక్షల రూపాయలకు పైగా జీతం. నిత్యం ఏసీ గదుల్లో జీవనం. ఇవన్నీ వదిలేసి తన్న చిన్ననాటి కోరిక తీర్చుకునేందుకు జన్మభూమికి తిరిగొచ్చారు. సొంతూరు ప్రకాశం జిల్లా అయినా నెల్లూరు జిల్లాలో కర్షకుడిగా స్థిరపడ్డారు. కంప్యూటర్లతో నిత్యం కుస్తీ పట్టే చేతులతో హలం పట్టి పంటలు సాగు చేస్తున్నారు. మెట్ట భూముల్లో రసాయన రహిత పంటలు పండిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కాటరి సాంబశివరావు.

READ ALSO : Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

ప్రకృతి ధర్మాన్ని పాటించినప్పుడు మానవుడు సుఖంగా ఆనందంగానే జీవించాడు. ఎప్పుడైతే ప్రకృతిని మన అవసరాల కోసం దుర్వినియోగం చేయడం మొదలు పెట్టామో.. మానవ మనుగడ ఆరోజు నుంచి దిగజారడం ప్రారంభమైంది. అది గ్రహించిన కొందరు ఇప్పుడు రసాయన సాగు విధానాన్ని పక్కనపెట్టేసి, ప్రకృతి విధానాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి సేద్యపు విధానాలే జీవితంగా భావిస్తున్నారు.

అన్నదాతలు పాత కాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రధాన పంటతోపాటు, అంతర్ పంటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, ఏఎస్ పేట మండలం, అనుమ సముద్రం గ్రామంలో ఎన్.ఆర్.ఐ కటారి సాంబశివరావు ప్రకృతి విధానంలో పలు పంటలు సాగుచేస్తూ.. నాణ్యమైన దిగుబడుల తీస్తున్నారు.

READ ALSO : Goat Farm : ఏఎంజీ గోట్ ఫామ్.. ఇక్కడ విదేశీ మేకలు లభించును

రైతు సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయాలనే కోరిక. అయితే తండ్రి కోరిక మేరకు కెమికల్ ఇంజనీరు చదివి.. విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తన కుమారి పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. పొలంలోనే ఇళ్లు నిర్మించుకొని, ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా ప్రకృతి విధానంలో పండ్లు , పూలు, పలు రకాల కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు.

ఈ పంటలకు అన్ని సీజన్ లో నీటిని అందించాలనే ఉద్దేశంతో ఫాంపాండ్ ఏర్పాటుచేసి అందులో నీటిని సోలార్ విత్యుత్ ను ఉపయోగించి  మొక్కలకు  అందిస్తున్నారు. తన తోట రోడ్డు ప్రక్కనే ఉండటంతో వచ్చిన దిగుబడిని ఏమార్కెట్ కు తరలించకుండా తోట వద్దే ఔట్ లేట్ ఏర్పాటు చేసి అమ్ముతూ.. మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

ఒక సంప్రదాయ, ఉద్యాన పంటలే కాదు.. వాటికి అనుబంధంగా గొర్రెలు, కోళ్లు, పశుల పెంపకం చేపడుతున్నారు. వీటినుండి వచ్చే వ్యర్ధాలను ఉపయోగించి ఘనజీవామృతం, జీవామృతం తయారుచేసి పంట పొలాలకు అందిస్తున్నారు. అంతే కాదు పలు రకాల కషాయాలు తయారుచేసి పంటలకు పిచికారిచేస్తూ.. చీడపీడలను నివారిస్తున్నారు. పంట వ్యర్ధాలను జీవాలకు మేతగా ఉపయోగిస్తూ.. సమీకృత వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు.

ఈ రైతుచేసే సాగువిధానాలను చుట్టుప్రక్కల రైతులు నిశితంగా గమనిస్తూ.. వారుకూడా ప్రకృతి విధానంలో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పంట కాకుండా.. అంతర పంటల సాగుతో లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు. ఏది ఏమైన రైతు సాంబశివరావు చేస్తున్నా ఫార్మింగ్.. నిజంగా ఒక రివాల్యూషన్ అని చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు