2014 Elections: మోదీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉంటామంటున్న నేషనల్ కాన్ఫరెన్స్.. పొత్తులతో తమకు ఒరిగేదేంటని ప్రశ్న

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్‭లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.

Omar Abdullah: ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి దేశంలోని విపక్షాలు ఏకం కావడానికి భిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లంతా ఒకటవుతారా, లేదా అనే విషయం పక్కన పెడితే.. బీజేపీని ఓడించడానికి అందరూ ఏకం కావాలని మాత్రం అందరూ స్టేట్మెంట్లు అయితే ఎప్పటి నుంచో ఇస్తున్నారు. అయితే అందరూ ఒకే చట్రంలో ఇమడటం లేదు. నితీశ్ ప్రయత్నాల్లో కొందరు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి కొందరు మద్దతుగా ఉన్నారు. కొందరేమో కాంగ్రెస్ పార్టీ లేకుండానే బీజేపీ ప్రత్యామ్నాయం కావాలని అంటున్నారు.

Kerala to Mecca: 8,600 కి.మీ, 370 రోజులు, 6 దేశాలు.. కేరళ నుంచి మక్కాకు కాలినడకన సాగిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయాణం

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి దూరంగా ఉండనుంది. ఆ పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్‭లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కేంద్రపాలితమైన కశ్మీర్‭లో ఎన్నికల విషయమై స్పష్టత వచ్చాకే వాటి గురించి మాట్లాడతామని అన్నారు.

Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

‘‘కశ్మీర్ అవతల మేమేం చేయగలం? మాకిక్కడ (జమ్మూ కశ్మీర్) ఉన్నవే ఐదు లోక్‭సభ స్థానాలు. ఇక ఈ సీట్లతో బీజేపీతో పోరాడుతామా అనేది ప్రశ్నార్థకమే. ఇక జమ్మూ కశ్మీర్ బయట ఏం చేస్తామన్నది అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు’’ అని శనివారం రాజౌరీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒమర్ అబ్దుల్లా అన్నారు. అందరి అవసరాలకు తమ తలుపులు కొడతారని, కానీ కశ్మీర్ కష్టాల్లో ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడలేదని అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

Bengal panchayat polls: పంచాయతీ ఎన్నికలనూ వదలని అల్లర్లు.. బెంగాల్‭లో ఇది ఆనవాయితీగా మారిందా?

‘‘ఈ ఎన్నికల పొత్తుతో మాకు ఒరిగిందేంటి? ఈ పొత్తులు వల్ల జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి జరిగిన ప్రయోజనం ఏమైనా ఉందా? నేను పదే పదే చెబుతున్నాను. అందరి అవసరాలకు మా తలుపు తడతారు. కేజ్రీవాల్ కష్టాల్లో ఉంటే మమ్మల్ని సంప్రదించారు. కానీ 2019లో జమ్మూ కశ్మీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు స్పందించలేదు. ఏ ఒక్కరూ కనీసం మావైపు చూడలేదు’’ అని అన్నారు. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి అయిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.

ట్రెండింగ్ వార్తలు