Pawan Kalyan : సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నారా..?

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయనకు ఉన్న అభిమానులు, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతి పోతుంది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది పవన్ కి ఫ్యాన్సే. అలాగే సినీ, టీవీ ఇండస్ట్రీలో

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయనకు ఉన్న అభిమానులు, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతి పోతుంది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది పవన్ కి ఫ్యాన్సే. అలాగే సినీ, టీవీ ఇండస్ట్రీలో చాలా మంది పవన్ పేరుని వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ని తమ వైపు తిప్పుకోడానికి, తమ సినిమాలకి రప్పించడానికి పవన్ కళ్యాణ్ ని పొగడటం, పవన్ కళ్యాణ్ సినిమాలని, అయన మంచితనాన్ని వాడటం చేస్తూ ఉంటారు.

చాలా మంది నటులకి పవన్ పక్కన ఒక్కసారి నటించినా చాలు అనే అనుకుంటారు. నిర్మాతలు కూడా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి. కానీ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో కొంతమంది పవన్ ని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సినిమా కష్టాల గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఈ వేడి ఇంకా చల్లారలేదు. పవన్ పై వైసీపీ నాయకులే కాక కొంతమంది సినీ ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది అయితే పవన్ వ్యాఖ్యలకి సినీ పరిశ్రమకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

BiggBoss 5 : బిగ్ బాస్ లోకి విష్ణుప్రియ… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ??

తెలుగు ఫిలిం ఫెడరేషన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకి ఎటువంటి సంబంధం లేదు అని అధికారకంగా లేఖని రిలీజ్ చేశారు. ఇక పోసాని రెండు రోజుల నుంచి పవన్ ని మీడియా ముందు తిడుతున్న సంగతి తెలిసిందే. అలాగే నిన్న ఏపీ మంత్రి పేర్ని నానితో తెలుగు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అంతే కాక పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యతిరేకించిన ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెలుగు నిర్మాతలు సపోర్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పేర్ని నాని మాట్లాడుతూ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సినీ పరిశ్రమకి సంబంధం లేదు అని ఫోన్ చేసి చెప్పారన్నారు.

అలాగే మోహన్ బాబు కూడా పవన్ కి సెటైర్ వేస్తూ పవన్ అడిగిన ప్రశ్నలకి ‘మా’ ఎలక్షన్స్ అయ్యాక సమాధానం చెప్తాను అన్నారు. మంచు విష్ణు కూడా ఇటీవల ‘మా’ నామినేషన్ల సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. ‘మా’ ఎలక్షన్స్ లో పోటీ చేసే కొంతమంది సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. ఇది ఇలా ఉండగా లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో నాగార్జున కూడా ఆ సినిమా సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా రెండు తెలుగు ప్రభ్యత్వాలు సినీ పరిశ్రమకి ఎంతో సపోర్ట్ చేస్తున్నాయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలని అభినందించారు. ఈ స్పీచ్ కూడా పవన్ స్పీచ్ కి అన్వయించారు పవన్ వ్యతిరేకులు.

Tollywood : తమిళ్ హీరో వర్సెస్ తెలుగు హీరో

కొద్ది మంది చిన్న హీరోలు, నటులు మాత్రమే పవన్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మిగిలిన చాలా మంది సినీ పరిశ్రమ వాళ్ళు పవన్ కి వ్యతిరేకంగానే ఉన్నారు. సినిమా కష్టాల గురించి ముందుకొచ్చి మాట్లాడితే ఇలా వ్యతిరేకిస్తారా అని అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభుత్వం సినీ పరిశ్రమకి సపోర్ట్ చేయాలి అంటే ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి అడిగి చేయించుకోవాలి కానీ ఇలా వ్యతిరేకిస్తే పనులు అవ్వవు అని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు