Paytm Loan : పేటీఎం బంపర్ ఆఫర్, రూ. 5లక్షల లోన్!.. వారికి మాత్రమే

పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చని, డిజిలైజేషన్ పద్ధతిలో జరిగే లోన్ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. అతని క్రెడిట్ అర్హతను గుర్తించి

Paytm To Offer Up To Rs 5 lakh Loan : డిజిటల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. క్షణాల్లో లోన్ తీసుకోవచ్చంటూ బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ పే అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 5 లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈఎంఐ (EMI) ఆప్షన్ సౌకర్యం కూడా కల్పించింది. అయితే.. అందరికీ కాకుండా.. చిరు వ్యాపారులకు మాత్రమేనని తెలిపింది. పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చని, డిజిలైజేషన్ పద్ధతిలో జరిగే లోన్ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ మొద్దమొత్తంలో లోన్ ను మంజూరు చేస్తుంది. అయితే.. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్ లో కొన్ని పద్ధతులును అనుసరించాల్సి ఉంటుంది.

Read More : Wifi Safety: వైఫై స్లో అయిందా.. ఇలా చేయండి

పేటీఎం యాప్ ను తెరిచి.. బిజినెస్ లోన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో అక్కడ డిస్ ప్లే అవుతుంది. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత ? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు ? ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాలి అనే విషయాలు అందులో ఉంటాయి.
చెక్ బాక్స్ పై క్లిక్ చేసి కొనసాగించడానికి గెట్ స్టార్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

Read More : Google Pay అదిరే ఆఫర్.. డిజిటల్ పర్సనల్ లోన్లు ఇస్తోంది.. లక్షల్లోనే..!

సీకేవైసీ నుంచి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది.
పాన్ వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్, ఈ మెయిల్ ఇతరత్రా అంశాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు