Poco C51 Discount : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌పై రూ. 2500 తగ్గింపు ధరతో పోకో C51 ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు..!

Poco C51 Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. రూ.25వేలు తగ్గింపుతో పోకో C51 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Poco C51 Gets a Rs. 2,500 Discount With an Airtel Prepaid Connection_ All Details

Poco C51 Discount : 2023 ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో Poco C51 ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌తో ఈ పోకో C51 ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోకో తగ్గింపు ధరపై ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌తో లాక్ చేసింది. కొన్ని ఎయిర్‌టెల్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో Poco C51 ఫోన్ (4GB+64GB RAM) స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 8,499 ఉండగా, 6.52-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది.

Read Also : OnePlus First Folding Phone : ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

MediaTek Helio G36 SoC ద్వారా పవర్ అందిస్తుంది. పోకో ఇండియా (Poco India) ఎయిర్‌టెల్ సహకారంతో (Poco C51)ని రూ. 2,500 తగ్గింపు అందిస్తుంది. ఈ ఫోన్‌ను భారత అత్యంత సరసమైన 4G స్మార్ట్‌ఫోన్‌గా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,999 జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ ఫోన్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌కు లాక్ చేసుకోవచ్చు. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు ఎయిర్‌టెల్ నుంచి 50GB వన్-టైమ్ మొబైల్ డేటాను కూడా పొందవచ్చు.

Poco C51 Gets a Rs. 2,500 Discount With an Airtel Prepaid Connection

గత ఏప్రిల్‌లో రూ. 8,499 ధరతో సింగిల్ 4GB + 64GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో పోకో C51 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.52-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. Poco C51 ఆక్టా-కోర్ MediaTek Helio G36 SoC ద్వారా ఆధారితమైనదిగా చెప్పవచ్చు. 4GB RAM స్టోరేజ్‌ సాయంతో వర్చువల్‌గా 7GB వరకు విస్తరించవచ్చు.

ఈ పోకో హ్యాండ్‌సెట్‌లో మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించిన 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, Glonass, Beidou, మైక్రో-USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాక్సిలరోమీటర్, బయోమెట్రిక్‌లతో వెనుకవైపు అమర్చిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. Poco C51 ఫోన్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. దీని కొలతలు 76.75×164.9×9.09mm, బరువు 192 గ్రాములు ఉంటుంది.

Read Also : Kia Seltos Facelift Bookings : 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ. 25వేలు మాత్రమే.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు