Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్..

ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Director Venkata Satya Announced Bumper Offer to Audience for Operation Raavan Movie

Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఆపరేషన్ రావణ్ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్ కుమార్, రఘు కుంచె.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా డైరెక్టర్ వెంకట సత్య తాజాగా మీడియాతో ముచ్చటించారు.

దర్శకుడు వెంకట సత్య సినిమా గురించి మాట్లాడుతూ.. మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. జరిగే పనులకు కారణమైన ఆలోచనలను మేము విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసినా, కరెక్ట్ చేసినా దానికి ఆ మనిషి ఆలోచనలే కారణం. మనం ఏ పని చేసినా ముందు ఆలోచనల్లో చేయాలా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ఈ సినిమా తీసాను. సరిగ్గా చూస్తే రామాయణం కూడా థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఆపరేషన్ రావణ్ లో రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చినట్టు మా సినిమాలో మాస్క్ పెట్టుకుని వస్తాడు. అందుకే ఈ సినిమాకు ‘ఆపరేషన్ రావణ్’ టైటిల్ పెట్టాం అని తెలిపారు.

Also Read : Raj Tarun : రేపే రాజ్ తరుణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. మీడియా ముందుకు వస్తాడా?

అలాగే సినిమాలో.. ఒక సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని, అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అని చూపిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఆగస్టు 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ మార్చుకొని జులై 26కి వస్తున్నాం అని చెప్పారు.

ఇక రక్షిత్ అట్లూరి సూపర్ హిట్ సినిమా పలాసకు సీక్వెల్ కూడా అంటుందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ రావణ్ సినిమాలో సినిమా మొదలయిన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము. అలా వెయ్యి మందికి సిల్వర్ కాయిన్స్ ఇస్తాము అని బంపర్ ఆఫర్ ఇచ్చారు డైరెక్టర్ వెంకట సత్య.

ఇక తన కొడుకు రక్షిత్ అట్లూరిని డైరెక్ట్ చేసిన విధానం గురించి మాట్లాడుతూ.. మా అబ్బాయిని డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నేను ఆలోచించలేదు. కానీ రక్షిత్ ఫైట్ సీన్స్ చేసేప్పుడు మాత్రం దెబ్బలు తగులుతాయేమో అని తండ్రిగా భయపడ్డాను. ఫైట్ సీక్వెన్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. రక్షిత్ చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో సింగిల్ షాట్ తో ఒక సీన్ చేసాం. అందులో రక్షిత్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు అని తెలిపారు.

అలాగే.. రాధికా శరత్ కుమార్ సినిమాలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆమెను అప్రోచ్ అయి కథ చెప్పడమే కష్టమైంది. కానీ సెట్స్ లోకి వచ్చాక డైరెక్టర్ గా నేను చెప్పినట్లు చేశారు. చరణ్ రాజ్ క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటుంది. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం కష్టం అని తెలిపారు. ఇక ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లో అనుకున్న డేట్స్ లో పూర్తిచేశామని తెలిపారు. ఈ సినిమా రిజల్ట్ మీద నెక్స్ట్ సినిమా ప్లాన్ ఉంటుంది అని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు