Gautam Gambhir : కోహ్లీతో రిలేష‌న్‌షిప్ పై గంభీర్‌.. గొడ‌వ‌ల్లేవ్.. అయితే..

హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్న గౌత‌మ్ గంభీర్ తొలిసారి మీడియా స‌మావేశంలో మాట్లాడాడు. కోహ్లీతో త‌న రిలేష‌న్ షిప్ గురించి స్పందించాడు.

Gautam Gambhir sets the record straight on his relation with Virat Kohli

Gautam Gambhir – Virat Kohli : శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు బ‌య‌లుదేరింది. అయితే.. అంత‌క ముందు హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్న గౌత‌మ్ గంభీర్ తొలిసారి మీడియా స‌మావేశంలో మాట్లాడాడు. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీతో త‌న రిలేష‌న్ షిప్ గురించి గౌతీ స్పందించాడు.

కోహ్లీతో త‌న‌కు మంచి సంబంధం ఉంద‌ని గౌత‌మ్ గంభీర్ చెప్పాడు. టీఆర్‌పీ పెంచ‌డం కోసం రిలేష‌న్ షిప్ గురించి క‌బ‌ర్లు చెప్ప‌డం లేద‌న్నాడు. ఓ ప్లేయ‌ర్‌గా విరాట్ పై ఎంతో గౌర‌వం ఉంద‌న్నాడు. కోహ్లీ ప్ర‌పంచ స్థాయి ఆట‌గాడని, క్లాస్ ప్లేయ‌ర్ అని చెప్పాడు. ఇద్దరం దేశం కోసం ఆడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపాడు. 140 కోట్ల మంది భార‌తీయుల త‌రుపున భార‌త జ‌ట్టు త‌రుపున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నామ‌ని, కోహ్లీతో ఆఫ్‌ ఫీల్డ్‌లోనూ చ‌క్క‌ని అనుబంధం ఉంద‌న్నాడు. అత‌డితో ఎన్నిసార్లు మాట్లాడాను అన్న‌ది ప‌బ్లిక్ గా చెప్పాల‌నుకోవ‌డం లేద‌న్నాడు.

Michael Vaughan : అబ్బే కోహ్లీకి అంత సీన్ లేదు..! టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే.. మైకెల్ వాన్‌

ఐపీఎల్ స‌మ‌యంలో ప‌లుమార్లు కోహ్లీ, గంభీర్‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ కోహ్లీ, గంభీర్ ల గొడ‌వలు ఏవైనా జ‌రుగుతాయోన‌ని అభిమానులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో గంబీర్ మీడియా వేదిక‌గా వీటిపై స్ప‌ష్ట‌త ఇచ్చాడు. కాగా.. 2011 టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో వీరిద్ద‌రు స‌భ్యులు అన్న సంగ‌తి తెలిసిందే.

వాస్త‌వానికి.. ఢిల్లీకి చెందిన వీరిద్ద‌రూ ఆరంభంలో మంచి మిత్రులుగా ఉన్నారు. 2009లో శ్రీలంక‌తో జ‌రిగిన ఓ వన్డే మ్యాచ్ స‌మ‌యంలో త‌న‌కు వ‌చ్చిన ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీకి ఇచ్చాడు గంభీర్‌. ఆ మ్యాచ్‌లో 224 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని, తొలి సెంచరీ చేసిన కోహ్లీకి గంభీర్ త‌న అవార్డును ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ నాయ‌క‌త్వంలోనే గంభీర్ టెస్టు కెరీర్ ముగిసిన సంగ‌తి తెలిసిందే.

Mohammed Shami : టీమ్ఇండియాలో ష‌మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా..? బుమ్రా, సిరాజ్‌లు కానేకాదు..

ట్రెండింగ్ వార్తలు