Top South Actors: వీళ్లు ఇకపై గ్లోబల్ స్టార్లు.. పారితోషికం భారీగానే!

తెలుగు సినిమా స్థాయి బాహుబలి ముందు.. తర్వాత.. అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత మన సినిమాల క్రేజ్ బాలీవుడ్‌లో బాగా పెరిగిపోయింది.

Top South Actors: తెలుగు సినిమా స్థాయి బాహుబలి ముందు.. తర్వాత.. అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత మన సినిమాల క్రేజ్ బాలీవుడ్‌లో బాగా పెరిగిపోయింది. బీ టౌన్‌లో మన హీరోల గురించి రోజూ చర్చించుకునే స్థాయికి టాలీవుడ్ వెళ్లిపోయింది. సౌత్ ఇండయన్ స్టార్లు అంటూ చులకనగా చూసే స్థాయి నుంచి కలెక్షన్స్‌ కా బాప్ టాలీవుడ్ స్టార్స్ అని బాలీవుడ్ వర్గాలు చెప్పుకునేలా మన టాలీవుడ్ హీరోలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

నేషనల్ మీడియా ఏబీపీ కథనం ప్రకారం.. సౌత్ ఫిల్మ్ స్టార్ల పాపులారిటీ ఇకపై సౌత్‌కే పరిమితం కాదు. కొత్తదనం, నటన, సినిమా విలువ, పారితోషికం కారణంగా సౌత్ స్టార్‌ల ఇంటి పేరు మారిపోయింది. వారంతా ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్‌ల కేటగిరీలోకి వచ్చేశారు. ఈ కథనం ప్రకారం.. తెలుగు స్టార్లు ప్రభాస్, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్‌బాబు గ్లోబల్ స్టార్‌ల కేటగిరీలోకి వచ్చేశారు.

ఈ ఐదుగురు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే 50కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం, అల్లు అర్జున్‌కి అంతకుమందు 10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేవారు. అయితే, పుష్ప: ది రైజ్ కోసం 50 కోట్లు తీసుకున్నాడు అల్లూ అర్జున్. ఈ చిత్రం తెలుగులోనే కాదు హిందీలో భారీ విజయం సాధించింది. రూ. 100కోట్లు వసూలు చేసి, అల్లు అర్జున్ క్రేజ్‌ని ఒక్కసారిగా పెంచేసింది.

ఈ సినిమా రెండవ భాగం పుష్ప: ది రూల్ కోసం అల్లు అర్జున్ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాడట. ఇప్పుడు సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్‌ల లిస్ట్‌లో అల్లు అర్జున్ చేరిపోయాడు. ఇక తెలుగులో స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఆర్ఆర్ఆర్ బజ్‌తోనే మంచి గుర్తింపు వచ్చేసింది.

OTT Release: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

మీడియా నివేదికల ప్రకారం, ఎన్టీఆర్ RRR కోసం రూ. 50 కోట్లు వసూలు చేశాడు. RRR కోసం రామ్ చరణ్ కూడా 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడగా.. మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయి వీరి పారితోషికం కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

బాహుబలి ప్రభాస్ విషయం చెప్పాలంటే మిగతా స్టార్స్ కంటే కాస్త ఎక్కువే వసూలు చేస్తున్నాడు. మీడియా కథనాల ప్రకారం, మొన్నటివరకు ఒక సినిమాకు రూ.100 కోట్లు వసూలు చేసిన ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగాతో సినిమాకి 150 కోట్లు వసూలు చేస్తున్నాడు.

RGV Tweets : పవన్‌కల్యాణ్‌గారూ.. భీమ్లానాయక్‌తో సబ్ కా బాప్ అని నిరూపించండి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటుడుగా ఉన్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా తియ్యలేదు.. కానీ, ఒక చిత్రానికి రూ.50 కోట్లు వసూలు చేస్తున్నాడు. త్వరలో రాజమౌళితో సినిమా ఉండగా.. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు పాన్ ఇండియా క్రేజ్ రావొచ్చు.

ట్రెండింగ్ వార్తలు