Maa Elections: ప్రకాష్ VS విష్ణు.. మధ్యలో పవన్.. కాకరేపుతున్న ఎలక్షన్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ నామినేషన్ల ప్రక్రియ కూడా ముగించుకొని ఎవరికి వారు గెలుపు కోసం..

Maa Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ నామినేషన్ల ప్రక్రియ కూడా ముగించుకొని ఎవరికి వారు గెలుపు కోసం పాకులాట ప్రారంభించారు. ఈనెల 10న ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఒకరిపై ఒకరు ఆరోపణలను మించి చేస్తున్న విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో హీట్ పెంచేస్తున్నాయి. ఇక, వీరికి అనుకూల వర్గాలు కూడా తోడై టీవీ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి.

Telugu Movie Releases: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు, నటుడు నరేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు విష్ణు ‘మీరు పవన్‌కల్యాణ్‌ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించగా.. దానికి ప్రకాష్ రాజ్ సమాధానంగా పవన్‌ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? పవన్ వేరు.. ఇండస్ట్రీ వేరని విష్ణు ప్రశ్నించడం బాగోలేదని వెల్లడించారు.

Nivetha Pethuraj: అందానికే కేరాఫ్ అడ్రస్ ఈ మలయాళ కుట్టీ

పవన్‌ కళ్యాణ్ మార్నింగ్‌ షో కలెక్షనంత ఉండదు.. మీ సినిమా బడ్జెట్‌.. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. మీకు పొలిటికల్‌ అజెండా ఉంటే మీరు చూసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ నటుడిగా మావాడని ఆయన పొలిటికల్ ఎజెండా మాకొద్దని.. సిద్ధాంతపరంగా పవన్ తో విబేధాలున్నా.. నటులుగా నేను నందా.. ఆయన బద్రి అంతే ఉంటుందన్నారు.

Acharya: క్రిస్టమస్‌కా.. సంక్రాంతికా.. మెగాస్టార్ రాక ఎప్పుడు?

తాను తెలుగువాడిని కాదని.. కర్ణాటకలో పుట్టి.. తమిళనాడు, ఏపీ, తెలంగాణలో నటుడిగా ఎదిగానని.. అంతమాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ‘మా’ నియమాల్లో ఉందా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌ మీద ఏదో ఒకటి చెప్పాలని విమర్శలు చేయడం కాదని.. తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా నేను సిద్ధమేనన్నారు. మరి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై విష్ణు ప్యానల్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు