Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనకు మద్దతు.. ఉదయాన్నే జంతర్ మంతర్‌కు ప్రియాంక గాంధీ..

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

Wrestlers Protest: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రియాంకగాంధీ.. ఉదయం జంతర్ మంతర్‌లోని రెజ్లర్లు ఆందోళన శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షాశిబిరంలో వారితో కూర్చున్నారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్, సంగీతా ఫొగట్‌లతో మాట్లాడిన ప్రియాంక.. వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

Wrestlers Protest : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. నీరజ్ చోప్రా ట్వీట్

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ షోఘట్, ఇతరులు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో వీరు ఆందోళన చేపట్టగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖల మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాక, విచారణకు సంబంధించిన కమిటీని కూడా నియమించారు. అప్పుడు రెజ్లర్లు ఆందోళన విరమించారు. గత వారంరోజుల క్రితం భూషణ్ శరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.

Wrestlers Protest: మేరీకోమ్‌కే బాధ్యతలు.. రెజ్లర్ల‌పై వేధింపుల ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు కమిటీని నియమించిన కేంద్రం

రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన వారం రోజులకు చేరింది. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రెజ్లర్ల శిబిరం వద్దకు వెళ్లి వారికి మద్దతు తెలిపారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పతకాలు సాధించి దేశపు ఆడపడుచులు వస్తే మనమందరం గౌరవిస్తాం. కానీ నేడు అదే కూతుళ్లు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై కూర్చున్నా వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో, నిందితుడు పోస్ట్ ను దుర్వినియోగం చేయడం ద్వారా అటగాళ్లపై ఒత్తిడి తీసుకురాకుండా ఆ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని ప్రియాంక అన్నారు.

Wrestlers Protest: తాత్కాలికంగా నిరసన విరమించిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా మంత్రితో చర్చలు అనంతరం నిర్ణయం ..

 

 

ఇదిలాఉంటే ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ జరిపి ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీచేసింది. శుక్రవారంకు విచారణ వాయిదా వేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు జరిపిన విచారణలో బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రుచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. వెంటనే కొద్దిగంటలకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదిలాఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. రెజ్లర్లు ఆందోళన విరమించలేదు. ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రెజ్లర్లు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు