Tunnel Raod in Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం.. 65 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు

ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్‌ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.

Karnataka: ప్రపంచంలో ట్రాఫిక్ ఇబ్బందుల్ని అత్యంత ఎక్కువ ఎదుర్కొంటున్న నగరాల్లో బెంగళూరు నగరం ఒకటి. పెరిగిన వాహనాలకు రద్దీకి అనుగుణంగా రోడ్ల నిర్మాణం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లడానికి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే ఈ ట్రాఫిక్ ఇక్కట్లను రూపుమాపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో భారీ సొరంగ రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Uttar Pradesh : సరయూ నదిలో ‘పానీ మే ఆగ్ లగాని హై’ అంటూ యువతి డ్యాన్సులు.. మండిపడుతున్న నెటిజన్లు

బెంగళూరులో ట్రాఫిక్‌ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు అనుమతులకై కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం తాజాగా ప్రతిపాదనలు పంపింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరిని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి బృందం భేటీ అయింది. ఇందుకు సంబంధించి మంత్రి నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో ట్రాఫిక్‌ తీవ్రమైన సమస్యగా మారుతోందని, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుతో సాధ్యం కావడం లేదని ప్రత్యామ్నాయమైన సొరంగ మార్గం ఏర్పాటు చేయదలిచామని మంత్రి సతీష్ జార్కిహోళి పేర్కొన్నారు.

Manipur Violence: ఇంఫాల్‭కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు

ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్‌ పురం – హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు. మంగళూరు జాతీయ రహదారి శిరాడిఘాట్‌ వద్ద సొరంగ మార్గం అంశం ప్రస్తావించిగా, దానికి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ప్రకటించారు. హొన్నావర – కుమట, బెంగళూరు హెబ్బాళ్‌ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు అనుమతులు కోరామని, రాష్ట్రానికి సంబంధించి మొత్తం 38 రోడ్లను నేషనల్‌ హైవేలుగా పరిగణించాలని కోరినట్లు మంత్రి సతీశ్‌ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు