Radhe Shyam: వాలెంటైన్స్ నైట్ థీమ్ పార్టీ.. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్!

సంక్రాంతి ఖచ్చితంగా రావాలనుకున్న రాధేశ్యామ్ కరోనాతో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి కొత్త డేట్ తో వచ్చేందుకు సిద్దమయ్యాడు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా..

Radhe Shyam: సంక్రాంతి ఖచ్చితంగా రావాలనుకున్న రాధేశ్యామ్ కరోనాతో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి కొత్త డేట్ తో వచ్చేందుకు సిద్దమయ్యాడు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది రాధే శ్యామ్. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు రాధే శ్యామ్ టీమ్. తాజాగా వాలెంటైన్ వీక్ రావడంతో సినిమా ప్రమోషన్ మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేశారు.

DJ Tillu: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!

సౌత్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా ఈ సినిమా కోసం ఓ నైట్ థీమ్ పార్టీ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. వాటికి ఇంకా పెంచేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు చిత్ర యూనిట్. హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్బులో నైట్ ధీమ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి మొదలు కానున్న పార్టీ కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేస్తున్నారు. సినిమా కథను ప్రతిబింబించేలా ఓ చేయి.. స్టెతస్కోప్.. సహా మరికొన్ని ఆర్ట్స్ కూడా అక్కడ దర్శనమివ్వబోతున్నాయి. ఈ థీమ్ పార్టీకి యూనిట్ అంతా హాజరు కానున్నారు.

Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?

గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ స్థాయి మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తుండగా.. అందుకు తగ్గట్లే భారీ స్థాయిలో ప్రత్యేకమైన ప్రమోషన్లను చేపట్టబోతున్నారు. అందులో భాగంగానే ఏర్పాటు చేయనున్న ఈ వాలెంటైన్స్ డే థీమ్ పార్టీతో సినిమా మీద ఆసక్తి మరింత పెరగడం ఖాయం. లవ్ స్టోరీ సినిమా కావడంతో ఈ వాలంటైన్ డే రాధేశ్యామ్ కి కలిసి వచ్చినట్లుగా కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు