Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తేదీ ఖరారు: మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ

మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభలో, మే 7న హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

Rahul Gandhi Tour: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మే ఆరు నుంచి రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణలొ పర్యటించనున్నారు. ఈమేరకు శనివారం కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా..ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి..ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

Also read:PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

ఈక్రమంలోనే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్..పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ ఛైర్మన్లతో సమావేశమై..రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. “రైతు సంఘర్షణ సభ” పేరుతో నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు స్వచ్చందంగా తరలివస్తారని నేతలు భావిస్తున్నారు.

Also read:Andra Pradesh : మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్?

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు సహా రైతులకు సంబంధించిన ఇతర సమస్యలపై టీకాంగ్రెస్ నేతలు సభలో మాట్లాడనున్నారు. అనంతరం మే 7న హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం సహా రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలనే విషయాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు వస్తాయని..ముఖ్యంగా యువ కాంగ్రెస్ నేతల్లో రాహుల్ పర్యటన ఉత్సాహం నింపుతుందని టీకాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Also read:Telangana : కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!

ట్రెండింగ్ వార్తలు