Indian Railway Covid : కరోనా కల్లోలం, ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరిట ప్రత్యేక రైలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Oxygen Express Trains : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లను ఆస్పత్రులకు త్వరితగతిన చేరవేసేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఓ ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది.

అన్ని రాష్ట్రాలూ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక ట్యాంకర్లతో కూడిన రైలును నడపనుంది. ముంబయి సమీపంలోని కాలామ్‌బాలి, బోయిసర్‌ రైల్వేస్టేషన్‌ల నుంచి ఖాళీ ట్యాంకర్లతో కూడిన రైలు విశాఖ, జెంషెడ్‌పూర్‌, రూర్కెలా, బొకారాల నుంచి ఆక్సిజన్‌ నింపుకొని ఆస్పత్రులకు చేరవేస్తుంది. ఈ విషయమై ఇప్పటికే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేశాఖను సంప్రదించాయి. దీంతో స్పందించిన రైల్వేశాఖ హుటాహుటిన కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాంకర్లను ఎక్కించేందుకు దించేందుకు ఎక్కడిక్కడ ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని జోనల్‌ రైల్వేస్‌కు సూచనలు చేసింది కేంద్రం. ఇప్పటికే పలు చోట్ల ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టారు. రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి వాటిని పూర్తి చేయనున్నారు. రైలు మార్గం ద్వారా వచ్చిన ట్యాంకర్లు రోడ్లపై వెళ్లేటప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ట్యాంకర్ల సైజ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

Read More : Hyderabad Traffic Police : పోలీసు శాఖలో కరోనా కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే కారణమా ?

ట్రెండింగ్ వార్తలు