Raja Sekhar : యాంగ్రీ స్టార్ డిమాండ్ మామూలుగా లేదుగా..

నెగెటివ్ క్యారెక్టర్ల కోసం ఇప్పటికే పలు ఆఫర్లు రాగా వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చిన రాజశేఖర్, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

Raja Sekhar: కొద్దికాలం క్రితం వరుస విజయాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన యాంగ్రీ స్టార్, డా.రాజశేఖర్ చాలా సంవత్సరాల తర్వాత ‘గరుడవేగ’ తో హిట్ కొట్టి, తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘కల్కి’ తో మరో సాలిడ్ సూపర్ హిట్ అందుకున్నారు. అప్పటినుండి సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం సోలో హీరోగా ‘శేఖర్’ అనే మూవీ చేస్తున్నారు.

 

నెగెటివ్ క్యారెక్టర్ల కోసం ఇప్పటికే పలు ఆఫర్లు రాగా వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చిన రాజశేఖర్, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మ్యాచో హీరో గోపి చంద్, శ్రీవాస్ కాంబోలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల తర్వాత ఓ ఫిల్మ్ తెరకెక్కబోతోంది. ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం రాజశేఖర్‌ను తీసుకున్నారు.

 

గోపి చంద్ సినిమాలో హీరో అన్నయ్య క్యారెక్టర్ కథకు కీలకంగా ఉంటుందట. ఈ రోల్ కోసం రాజశేఖర్‌ను అప్రోచ్ అవ్వగా దాదాపు 4 కోట్ల రూపాయల పారితోషికం అడిగారట. దాంతో పాటు హీరోకి సమానంగా తన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకోవాలని కూడా కండీషన్ పెట్టారట. రాజశేఖర్ అయితే ఆ క్యారెక్టర్‌కి యాప్ట్ అవుతారని మూవీ టీం ఆయన కండీషన్స్‌కి ఓకే చెప్పారనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

NTR – Ram Charan : ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’..

ట్రెండింగ్ వార్తలు