Chiranjeevi – Ram Charan : ‘విశ్వంభర’ సెట్‌లో రామ్ చరణ్.. తండ్రి కొడుకుల మధ్య స్టార్ సినిమాటోగ్రాఫర్..

తాజాగా విశ్వంభర సెట్ కి రామ్ చరణ్ వచ్చాడు.

Mega Power Star Ram Charan visited Chiranjeevi Vishwambhara Set Photo goes Viral

Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర'(Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ జరుపుకుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కోసం 20 రోజుల పైగా షూట్ చేశారు. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. విశ్వంభరపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.

Also Read : Kajal Aggarwal : కాజ‌ల్‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌.. షూటింగ్ అంతా చేసి..

రెగ్యులర్ గా విశ్వంభర సెట్స్ కి ఎవరో ఒకరు సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. ఈ సెట్స్ నుంచి ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా విశ్వంభర సెట్ కి రామ్ చరణ్ వచ్చాడు. మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ కాసేపు ముచ్చటించారు. అయితే ఈ ఇద్దరితో కలిసి విశ్వంభర సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఫోటో దిగారు. ఈ ఫోటోని చోటా కె నాయుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మెగా పవర్ అని పోస్ట్ చేశారు.

దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే ఫొటోలో ఉండటం, చరణ్ విశ్వంభర సెట్ కి వెళ్లాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విశ్వంభర సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కాబోతుంది.