Kajal Aggarwal : కాజ‌ల్‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌.. షూటింగ్ అంతా చేసి..

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న చిత్రం 'ఇండియ‌న్-2'.

Kajal Aggarwal : కాజ‌ల్‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌.. షూటింగ్ అంతా చేసి..

Director Shankar big shock to Kajal Aggarwal

Updated On : June 2, 2024 / 3:58 PM IST

Kajal Aggarwal -Shankar : లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న చిత్రం ‘ఇండియ‌న్-2’. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగులో భార‌తీయుడు 2 పేరుతో విడుద‌ల కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా శ‌నివారం రాత్రి చెన్నైలో ఈ సినిమా ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించిన పాట‌లు అల‌రిస్తున్నాయి.

ఈ ఈవెంట్‌కు హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా హాజ‌రైంది. కాగా.. ఆడియో లాండ్‌లో చిత్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ కాజ‌ల్ అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ మూవీలో కాజ‌ల్ క‌నిపించ‌ద‌ని చెప్పాడు. ఆమె భార‌తీయుడు 3లో క‌నిపించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.

Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ ‘ప‌రువు’ ట్రైల‌ర్‌.. ఆస‌క్తిక‌రంగా..

కాజ‌ల్‌ను ఇండియ‌న్‌2లో చూద్దామ‌ని భావించిన ఆమె అభిమానుల‌కు ఇది నిజంగా పెద్ద షాక్‌గా చెప్ప‌వ‌చ్చు. మొద‌టి, రెండ‌వ భాగానికి చాలా స‌మయం తీసుకున్నార‌ని, మ‌రీ మూడో భాగం ఎప్పుడు విడుద‌ల అవుతుందోన‌ని అంటున్నారు.

ఇండియన్ 2 చిత్ర విష‌యానికి వ‌స్తే.. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Manamey Movie : శర్వానంద్ ‘మనమే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో..? గెస్ట్ గా రామ్ చరణ్..?