Sorghum Varieties : అధిక దిగుబడినిచ్చే నూతన జొన్న రకాలు

Sorghum Varieties : అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

High yielding new sorghum varieties

Sorghum Varieties : ఖరీఫ్‌లో వర్షాధారంగా జొన్న అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అయితే ఆలస్యంగా జొన్నను విత్తుకోవడం వల్ల.. చీడపీడలు ఆశించి.. దిగుబడులు తగ్గిపోతున్నాయి. కావున రైతులు ముందుగానే జొన్నను సాగు చేసుకోవాలి. ప్రసుత్తం జొన్న సాగు జూన్‌ నెల అనుకూలం. అయితే అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Cluster Beans Cultivation : గోరు చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం

చిరుధాన్యాల పంటల్లో ముఖ్యమైన పంట జొన్న. దీనిని ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా సాగవుతుంది. ఒకప్పుడు జొన్నసాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పధం పెరగటం, తక్కువ దిగుబడులవల్ల సాగు గిట్టుబాటుకాకపోవటం వల్ల రైతులు  జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు.

కానీ  ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు, హైబ్రిడ్ లు,  రైతులకు అందుబాటులో ఉండటంతో  ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.

ప్రస్తుతం జొన్న సాగుకు అనుకూలమైన సమయం. అయితే రకాల ఎంపికలో రైతులు అవగాహతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్న అధిక దిగుబడినిచ్చే రకాలు.. వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు, రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. నగేష్ కుమార్.

Read Also : Groundnut Cultivation : వేరుశనగ సాగులో మేలైన యాజమాన్యం