Groundnut Cultivation : వేరుశనగ సాగులో మేలైన యాజమాన్యం
Groundnut Cultivation : సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుదని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె.ఎస్.ఎస్. నాయక్.

Groundnut Cultivation
Groundnut Cultivation : నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్నిబట్టి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశనగను జూన్ నుండి ఆగష్టు వరకు సాగుచేస్తారు.
పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. అయితే సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుదని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె.ఎస్.ఎస్. నాయక్.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
ఖరీఫ్‌లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.
దీనికితోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపధ్యంలో ఖరీఫ్ వేరుశనగలో అధిక దిగుబడిని పొందాలంటే, రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు, ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె.ఎస్.ఎస్. నాయక్
భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మపోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు