Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కోసం.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. భలే ఉందే ఈ సాంగ్..

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని సాగే ఈ టైటిల్ సాంగ్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు.

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Title Song Released by Raghavendra Rao

Honeymoon Express Title Song : 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు(Chaitanya Rao) ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల షరతులు వర్తిస్తాయి, పారిజాత పర్వం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మెప్పించాడు. త్వరలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చైతన్య రావు, హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Chiranjeevi – Ram Charan : ‘విశ్వంభర’ సెట్‌లో రామ్ చరణ్.. తండ్రి కొడుకుల మధ్య స్టార్ సినిమాటోగ్రాఫర్..

బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా నాలుగో పాటను విడుదల చేశారు. స్ఫూర్తి జితేందర్, కిటు విస్సాప్రగడ కలిసి రాసిన ఈ పాటని స్ఫూర్తి జితేందర్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడారు. మీరు కూడా ఈ పాటని వినేయండి..

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని సాగే ఈ టైటిల్ సాంగ్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. డైరెక్టర్ బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చిన ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ లో డీన్ గా కూడా పనిచేసి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్ బాగుంది. యువ పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ బాగా పాడింది. మూవీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.