Koppula Eshwar : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తప్పిన ప్రమాదం

Koppula Eshwar : తెలంగాణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్తున్న కాన్వయ్‌ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గన్ మెన్లకు ప్రమాదం తప్పింది.

koppula eshwar ( Image Credit : Google )

Koppula Eshwar : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కొప్పుల ఈశ్వర్ వెళ్తున్న కాన్వయ్‌ను లారీ ఢీకొట్టింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

అదృష్టవశాత్తూ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గన్ మెన్లకు ప్రమాదం తప్పింది. అదే కాన్వాయ్‌లో వెనుక కోరుకంటి చందర్ వాహనంలో కొప్పుల ఈశ్వర్ వస్తున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : ఎగ్జిట్‌పోల్స్ తర్వాత స్పష్టత వస్తుందనుకుంటే మరింత గందరగోళం