Rajamouli : రాజమౌళికి అరుదైన గౌరవం.. ISBC చైర్మ‌న్‌గా నియామకం..

తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ప్రపంచ వేదికల పై నిలబెట్టిన రాజమౌళి.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్..

Rajamouli appointed as chairman for Indian Schools Board for Cricket

Rajamouli : తెలుగు సినిమాని మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా ప్రపంచ వేదికల పై నిలబెట్టాడు. బాహుబలితో (Baahubali) మన సినిమాలు ఏ స్థాయికి ఎదిగాయి అని వరల్డ్ ఆడియన్స్ కి చూపించిన రాజమౌళి.. RRR చిత్రంతో మన కథలోని ఎమోషన్స్ ని ప్రపంచం మొత్తం ఫీల్ అయ్యేలా చేశాడు. ఇక నాటు నాటుకి (Naatu Naatu) ఆస్కార్ అందుకొని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ కి ఇంతటి గుర్తింపుని తీసుకొచ్చి మనల్ని గర్వపడేలా చేసిన రాజమౌళికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

Bro Movie : మరో మూడు వారాల్లో రిలీజ్.. ఇంకా పూర్తి కానీ షూటింగ్.. ఫారిన్‌లో బ్రో సాంగ్ మేకింగ్..

ఇక నుంచి రాజమౌళి సినిమా రంగంతో పాటు క్రీడా రంగంలో కూడా భాద్యతలు నిర్వహించనున్నాడు. ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్ (ISBC) చైర్మ‌న్‌గా భాద్యతలు స్వీకరించబోతున్నాడు. ప్రతిభ ఉండి కూడా అవకాశం, స‌దుపాయాలు లేక ఎదురు చూసే క్రికెటర్స్ ని గుర్తించి వారిలోని ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు ఈ బోర్డ్ ఏర్పడింది. మాజీ క్రికెట‌ర్ దిలీప్ వెంగ్ స‌ర్కార్ మొదలైన ఈ బోర్డు.. గ్రామీణ స్థాయి నుంచి దేశం మొత్తం మీద దాదాపు 25 కోట్ల మంది విద్యార్థుల‌ను టీమ్స్ గా విభ‌జించి ప‌లు టోర్న‌మెంట్స్ నిర్వహిస్తూ వారిలోని ప్రతిభని జాతీయ స్థాయిలో అందరికి తెలిసేలా చేస్తుంది.

Sreeleela : శ్రీలీల ప్లేస్ రష్మికకు వెళ్లిందా? శ్రీలీల గురించి నాగశౌర్య చెప్పిన సీక్రెట్..

ఇప్పుడు ఈ బోర్డులో దర్శకధీరుడు రాజమౌళి చైర్మన్ గా బాధ్యత స్వీకరించి మరికొంతమంది క్రికెటర్స్ ని ఎంక‌రేజ్ చేసి దేశానికీ పరిచయం చేయనున్నాడు. ఇక ఇప్పటికే ఈ బోర్డులో రాజమౌళి కుమారుడు కార్తికేయ జాయింట్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు. మరో పక్క రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్యసభ ఎంపీగా నియామకం అయ్యిన సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి అన్న ఎం ఎం కీరవాణి కూడా ఆస్కార్ మెంబెర్ గా ఇటీవల ఎంపిక అయ్యాడు. దీంతో రాజమౌళి కుటుంబం మొత్తం సంతోషంలో ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు