కడుపు ఎండుతున్నా భారత్ టార్గెట్‌గా పాక్‌ కుట్రలు.. సైన్యంతో ఉగ్రవాద చర్యలు చేయిస్తూ కవ్వింపులు

కశ్మీర్‌లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ.. మనకు కంటిమీద కనుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్‌లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి.

Indian Army foils attack by Border Action Team in Kupwara

Indian Army: పరువు లేదు.. పరపతి అసలే లేదు. రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. తినేందుకు తిండే దిక్కు లేదు. అయినా పాకిస్థాన్ టార్గెట్ భారత్ ఒక్కటే. దేశం అభివృద్ధి చెందాలని పాలకులు కోరుకోరు. ప్రజల్లో మార్పు రాదు. ఉగ్రవాద చర్యలతో మంట కాగడమే పాక్‌కు అలవాటైపోయింది. భారత్ సహనం, శాంతి మంత్రం చెతగాని తనంగా చూస్తోన్న దాయాది దేశం.. కవ్వింపులు, కుట్రలతో మనకు గోతులు తీసే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్‌లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ.. మనకు కంటిమీద కనుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్‌లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి.

భారత్‌కు మరో రూపంలో పరీక్ష
కొన్నాళ్లుగా కశ్మీర్‌లో టెర్రర్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోయింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న భారత్‌కు మరో రూపంలో పరీక్ష పెడుతోంది పాక్. ప్రతీవారం రోజుల్లో రెండు, మూడు మేజర్ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. దీనికి కారణం పాక్ సైన్యం కవ్వింపులు, కుట్రలే అని తేలిపోయింది. నిఘావర్గాల అంచనాలు నిజమయ్యాయి. అంతా బానే ఉన్నా ఎక్కడో తేడా కొడుతుందని భావించిన బలగాలు.. అసలు విషయం తెలుసుకునేందుకు నెలల తరబడి ప్రయత్నించాయి. వరుసగా ఉగ్రదాడులు, జవాన్లపై కాల్పులు, ఉన్నతస్థాయి అధికారుల టార్గెట్‌గా.. పాక్ సీక్రెట్ టీమ్ దాడి చేస్తున్నట్లుగా అనుమానిస్తోంది భారత సైన్యం.

కుప్వారా ఉగ్రదాడిలో కీలక విషయాలు
ఈ మధ్యే భారత భూభాగంలోకి చొరబడేందుకు జరిగిన ప్రయత్నాలను మన సైన్యం తరిమికొట్టింది. జమ్మూకశ్మీర్‌ కుప్వారాలో ఓ ఉగ్రదాడిపై కీలక విషయాలు బయటపెట్టింది భారత ఆర్మీ. కుప్వారాలో దాడి చేసింది.. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమేనని స్పష్టం చేసింది. ఈ అటాక్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ చేసిన దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది.

పాక్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి సాయం చేస్తోంది. మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భారత భద్రతా దళాలు పసిగట్టాయి. వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. అలర్ట్ అయిన భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. దాదాపు మూడు గంటల పాటు ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

అయితే ఈ ఒక్క ఘటనే కాదు.. ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి. టైట్ సెక్యూరిటీ పెట్టినా, నిఘా వ్యవస్థను పటిష్టం చేసినా, స్థానికంగా ఇన్‌ఫార్మర్ వ్యవస్థ పనిచేస్తున్నా.. ఉగ్రవాద చర్యలు పెరగడంపై భారత్ బలగాలకు అంతు చిక్కలేదు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని అనుకున్నా.. శత్రువు ఏ రూపంలో ఎవరి రూపంలో వస్తున్నాడో తెలుసునేందుకు టైమ్ పట్టింది. పాక్ డైరెక్టుగానే టెర్రర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహిస్తుందనేది తెలిసిన విషయమే అయినా.. అది మరోసారి ప్రూవ్ అయింది.

Also Read: ఎన్నికల రేసు అంచనాలను మార్చేసిన కమలా హారిస్.. గేమ్‌ఛేంజర్‌గా లేడీ పొలిటికల్ స్టార్

పాకిస్థాన్ సైన్యంలా పైకికవరింగ్ ఇస్తూ..
పాక్ భద్రతా బలగాలు డైరెక్టుగానే భారత్‌పై పోరాడుతున్నాయి. ఉగ్రవాద కవ్వింపులు ఎలాగూ ఉంటూనే ఉంటాయి. అటు పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలసి ఉండే టీమే.. బోర్డర్ యాక్షన్ టీమ్. దీని కుట్రలకు లెక్కే లేదు. అచ్చం పాకిస్థాన్ సైన్యంలా పైకికవరింగ్ ఇస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా.. నిఘాకు చిక్కకుండా భారత్ సైన్యంపై కాల్పులు జరిపి ప్రాణాలు బలి తీసుకోవడం వాళ్లకు మానసిక ఆనందం అయిపోయింది. ఈ కుట్రలను పసిగట్టిన భారత్ సైన్యం కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా.. బార్డర్ వెంట నిఘాను స్ట్రాంగ్ చేసి.. ఉగ్రమూకలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తోంది భారత సైన్యం.

ట్రెండింగ్ వార్తలు