తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. సొంత గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సొంతగూటికి తిరిగి వచ్చారు.

gadwal mla bandla krishna mohan reddy rejoins BRS party

bandla krishna mohan reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న బీఆర్ఎస్ పార్టీకి ఊరట లభించింది. ఈ నెలారంభంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సొంతగూటికి తిరిగి వచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆయన కలిశారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయనతో చెప్పారు. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ ను కలుస్తానని అన్నారు.

కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్, జగదీశ్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

Also Read: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జూలై 6న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కృష్ణ మోహన్ రెడ్డి చేరికను గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, వారి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే సరితా తిరుపతయ్య వర్గంతో పొసగకపోవడం వల్లే కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరినట్టు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు