Ranveer Deepika : షారుఖ్, సల్మాన్ ఇంటి పక్కనే.. 119 కోట్లతో నాలుగు అంతస్థులని కొన్న రణవీర్ దీపికా..

బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొనేకునే సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. వీటిపై కోట్ల‌ల్లో బాగానే సంపాదిస్తున్నారు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఇండియాలోనే..........

Ranveer Deepika :  బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొనేకునే సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. వీటిపై కోట్ల‌ల్లో బాగానే సంపాదిస్తున్నారు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది రిచెస్ట్ క‌పుల్‌గా నిలిచారు రణవీర్ దీపికా. తాజాగా బాలీవుడ్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన వార్త బాగా వైరల్ అవుతుంది. వీరిద్దరూ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రదేశాల్లో ఒకటైన బాంద్రాలో అత్యంత ఖరీదైన అపార్టుమెంట్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం.

Russo Brothers : ధనుష్ కోసం భారత్‌కి రాబోతున్న అవెంజర్స్, కెప్టెన్ అమెరికా డైరెక్టర్స్..

షారుఖ్ ఖాన్ పాపుల‌ర్ బంగ్లా మ‌న్న‌త్, సల్మాన్ ఖాన్ ఇళ్లులు ఉన్న లైన్ లోనే వీరు అపార్ట్మెంట్స్ ని కొన్నారట. ఆ ఏరియాలోని ఓ అపార్ట్మెంట్ లో 16, 17, 18, 19 ఇలా మొత్తం నాలుగు అంత‌స్థుల‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం వీటి విలువ దాదాపు అక్ష‌రాలా రూ.119 కోట్లు. త్వ‌ర‌లోనే ర‌ణ్‌వీర్-దీపికా ఇక్కడికి మారబోతున్నారు. దీంతో సల్మాన్, షారుఖ్ ఇళ్ల దగ్గరికి షిఫ్ట్ అవ్వబోతున్నారు ఈ స్టార్ కపుల్. ఇంత ధర పెట్టి కొనడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్ లో కొన్నారంటే బాగానే సంపాదిస్తున్నారు ఇద్దరూ కలిసి అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

ట్రెండింగ్ వార్తలు