Rashmika Mandanna: సౌత్ టూ నార్త్ బిజీ బిజీ.. సిటీకో ఇల్లు కొనేసిన రష్మిక!

క్రేజీ స్టార్స్ సినిమాలకు సైన్ చేస్తూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది రష్మికా మందన్నా. సౌత్ టు నార్త్ అన్ని లాంగ్వెజెస్ లో వర్క్ చేస్తుంది.. సో వెళ్లిన చోటల్లా..

Rashmika Mandanna: క్రేజీ స్టార్స్ సినిమాలకు సైన్ చేస్తూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది రష్మికా మందన్నా. సౌత్ టు నార్త్ అన్ని లాంగ్వెజెస్ లో వర్క్ చేస్తుంది.. సో వెళ్లిన చోటల్లా ప్రతిసారి బయట ఉండాలంటే తనకు బాగా చికాకు అంటోంది. రెండు చేతులా సంపాదిస్తుంది కదా.. సిటీకో లగ్జరీ ఇంటిని కొనేసింది. సినిమాలకు సినిమాలు.. సిటీకో ల్యావిష్ హోమ్.. క్రష్మిక కథే వేరుంది.

Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

కోలీవుడ్ స్టార్ విజయ్ – టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి కాంబోతో కలిసి కొత్త మూవీ పట్టాలెక్కేసింది రష్మికా. వెరీ రీసెంట్ గా జరిగిన ఈ మూవీ లాంచింగ్ లో క్యూట్ క్యూట్ మూమెంట్స్ తో మరోసారి అట్రాక్ట్ చేసింది. బబ్లీగా.. ఛైల్డ్ మెంటాలిటీలా కనిపిస్తుంది కదా అని నేషనల్ క్రష్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సౌత్ టు నార్త్ వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉంటూనే సిటీకో లగ్జరీ ఇంటిని కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనేస్తుంది. షూటింగ్స్, ప్రమోషన్స్ కోసం మెయిన్ సిటీస్ కి వెళ్లిన ప్రతీసారి హోటల్స్ లో స్టే చేయడం ఇష్టం లేని రష్మికా.. మెట్రో సిటీస్ లో తనకంటూ ఓ ఇంటిని సొంతం చేసుకుంటోంది.

Rashmika Mandanna: యానిమల్ కోసం శ్రీవల్లి అలా మారుతోందా..?

తెలుగులో రష్మికా ఫుల్ బిజీ. పుష్ప2తో పాటూ దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇప్పుడు విజయ్ – వంశీ పైడిపల్లి – దిల్ రాజు ప్రాజెక్ట్ లో భాగమైంది. ఇప్పుడని కాదు స్టార్ ట్యాగ్ లైన్ తగిలినప్పుడే హైదరాబాద్ లో ల్యావిష్ హౌజ్ ఓనర్ గా ఎదిగింది. కర్ణాటక కూర్గ్ లోని సొంతింటిలో తన పేరెంట్స్ ఇప్పటికీ ఉంటున్నా.. రష్మిక మాత్రం హైదరాబాద్, బెంగళూర్ లో లగ్జరీ ఇళ్లను దక్కించుకుంది. మరోవైపు తన ఫేవరెట్ హ్యాంగవుట్ గోవాలోనూ 2021లో పెద్ద బంగ్లాను కొనేసింది. పైగా గోవాలో తన కొత్తింటిని చూసి జెలస్ గా ఉందా అని కూడా అందరూ ఉడక్కునేలా పోస్ట్ చేసింది.

Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

కూర్గ్, బెంగళూర్, హైదరాబాద్, గోవాలోనే కాదు.. తన టార్గెట్ సిటీ ముంబైలోనూ రష్మికకు సొంతిళ్లు ఉంది. బాలీవుడ్ బిజీ అవుతున్న టైమ్ లోనే ప్లాన్ చేసిన రష్మికా 2021లో ముంబైలో పర్మినెంట్ అడ్రస్ సెట్ చేసుకుంది. తన అకౌంట్ లో ముంబై రిచ్ హౌజ్ వచ్చిపడింది. ఈమధ్యే రణ్ బీర్ – సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీలో ప్లేస్ దక్కించుకున్న రష్మికా.. సిద్దార్ధ్ మల్హోత్రా మిషన్ మజ్నూ, అమితాజ్ గుడ్ బై ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. సో బాలీవుడ్ క్రేజీ స్టార్స్ నుంచి ఆఫర్స్ వస్తున్న టైమ్ లో ముంబైలో కూడా రష్మికకు ఇళ్లు అవసరమే మరి.

ట్రెండింగ్ వార్తలు