Ravindra Jadeja: 93 సెక‌న్ల‌లోనే ఓవర్‌ పూర్తి.. బిష‌న్ సింగ్ బేడీ రికార్డు బ్రేక్

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) చ‌రిత్ర సృష్టించాడు. లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఆస్ట్రేలియా(Australia)తో జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లో మూడో రోజు స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌ల‌ను ఔట్ చేయ‌డం ద్వారా అరుదైన ఘ‌న‌త‌ను సొంత చేసుకున్నాడు.

Ravindra Jadeja

Jadeja: టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) చ‌రిత్ర సృష్టించాడు. లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఆస్ట్రేలియా(Australia)తో జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లో మూడో రోజు స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌ల‌ను ఔట్ చేయ‌డం ద్వారా అరుదైన ఘ‌న‌త‌ను సొంత చేసుకున్నాడు. టీమ్ఇండియా త‌రుపున అత్యధిక వికెట్లు తీసిన ఎడమ‌చేతి వాటం స్పిన్న‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో బిష‌న్ సింగ్ బేడీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. బిషన్ సింగ్ బేడీ 67 టెస్టుల్లో 266 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా జ‌డేజా 65 టెస్టుల్లో 24.25 స‌గ‌టుతో 2.44 ఎకాన‌మీతో 267 వికెట్లు తీశాడు.

టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్ల

రవీంద్ర జడేజా 65 టెస్టులలో 267 వికెట్లు

బిషన్ సింగ్ బేడీ 67 టెస్టులలో 266 వికెట్లు

ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడ‌మ చేతి వాటం స్పిన్న‌ర్ల జాబితాలో జ‌డేజా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్న‌ర్ రంగ‌నా హెరాత్ 93 టెస్టులలో 433 వికెట్లతో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డేనియల్ వెటోరి, ఇంగ్లాండ్ కు చెందిన డెరెక్ అండ‌ర్‌వుడ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

WTC Final 2023: ఓటమి అంచుల్లో టీమిండియా.. విజయం సాధించాలంటే 121ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందేనా..

టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం స్పిన్న‌ర్లు

రంగనా హెరాత్ 93 టెస్టులలో 433 వికెట్లు
డేనియల్ వెటోరి 113 టెస్టులలో 362 వికెట్లు
డెరెక్ అండర్‌వుడ్ 86 టెస్టులలో 297 వికెట్లు
రవీంద్ర జడేజా 65 టెస్టులలో 267 వికెట్లు

టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితా

అనిల్ కుంబ్లే 619 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ 474 వికెట్లు
కపిల్ దేవ్ 434 వికెట్లు
హర్భజన్ సింగ్ 417 వికెట్లు
ఇషాంత్ శర్మ 311 వికెట్లు
జహీర్ ఖాన్ 311 వికెట్లు
ర‌వీంద్ర జ‌డేజా 267 వికెట్లు

Ajinkya Rahane: ర‌హానే చేతి వేలికి గాయం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. రెండో ఇన్నింగ్స్ ఆడ‌డంపై

93 సెక‌న్ల‌లో ఓవ‌ర్ పూర్తి..

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ లో అత్యంత వేగ‌వంతంగా ఓవ‌ర్‌ను పూర్తి చేశాడు ర‌వీంద్ర జ‌డేజా. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త‌రువాత జ‌డేజా త‌న తొలి ఓవ‌ర్‌ను కేవలం 93 సెక‌న్ల‌లోనే పూర్తి చేశాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచుల్లో ఇంత త్వ‌ర‌గా ఓవ‌ర్‌ను పూర్తి చేయ‌డం ఓ రికార్డే

WTC Final 2023: బాలకృష్ణ డైలాగులు చెబుతూ అదరగొట్టేసిన స్టీవ్ స్మిత్.. వీడియో

ట్రెండింగ్ వార్తలు